Ayodhya Ram Mandir Leakage : అయోధ్య రామమందిరం పైకప్పులో లీకేజీలు ఏర్పడ్డాయని ఆలయ ప్రధాన పూజరి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. ఈ లీకేజీ వల్ల గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మొదటిసారి శనివారం రాత్రి భారీ వర్షం పడటం వల్ల ఈ లీకేజీ సమస్య బయటపడిందని అన్నారు. ఈ వర్షపు నీరు సరిగ్గా బాలరాముడి విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే, వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలోనే కారుతోందని దాస్ వివరించారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
'రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన తర్వాత కురిసిన తొలి వర్షానికే ఇలా లీకేజీ అయ్యింది. ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకూ కూడా సరైన ఏర్పాట్లు లేవు. ఈ సమస్యను అధికారులు వీలైనంత త్వరగా పరిష్కరించాలి. ప్రస్తుతం వర్షకాలం రానున్న రోజుల్లో గర్భగుడిలో పూజలు చేయడం కష్టంగా మారుతుంది' అని ఆచార్య సత్యేంద్ర దాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
VIDEO | " it is very surprising. so many engineers are here and the pran pratishtha was held on january 22, but water is leaking from the roof. nobody would've thought this," says ram temple chief priest acharya satyendra das.
— Press Trust of India (@PTI_News) June 24, 2024
(full video available on pti videos -… pic.twitter.com/tf1zRDQ34D
'నిర్మాణ పనులు పూర్తయితే సమస్య ఉండదు'
మరోవైపు ఈ లీకేజీపై రామమందిరం నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర స్పందించారు. ఆలయానికి చేరుకుని పైకప్పుని వాటర్‌ప్రూఫ్‌గా మార్చేలా మరమ్మతు పనులు చేయాలని సూచించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అయోధ్యలో ఉండి ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్లు మిశ్ర తెలిపారు. ' మొదటి అంతస్తు నుంచి నీరు కారడాన్ని గమనించాను. నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. రెండో అంతస్తు శిఖరం పూర్తయితే ఈ సమస్యను ఉండదు. ప్రస్తుతం నీరు రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాం. అయితే మొదటి అంతస్తు పనులు జులై చివరకి, మొత్తం ఆలయ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తవుతాయి' అని మిశ్ర పేర్కొన్నారు.
In a statement to ANI, Sri Ram Mandir Construction Committee Chairman, Nripendra Mishra speaks on the alleged water leakage at the Shri Ram Temple; and says, " i am in ayodhya. i saw the rainwater dropping from the first floor. this is expected because guru mandap is exposed to… pic.twitter.com/nwY9qGXTJ9
— ANI (@ANI) June 24, 2024
ఇకపై వీఐపీ ఫోన్ బుకింగ్ లేదు
రామమందిరంలో ఫోన్ ద్వారా చేసే వీఐపీ దర్శన బుకింగ్‌ను నిలిపివేసినట్లు శ్రీ రామజన్మ భూమి ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. ఇకపై రాత్రి 9 గంటల వరకు మాత్రమే భక్తులను ఆరతి కోసం సుగ్రీవ కోట ద్వారం అనుమతి ఉంటుందని చెప్పారు. అదే సమయంలో 9:15లకు ఆరతీ పాస్ ఉన్నవారి ప్రవేశం లభిస్తుందని తెలిపారు. ఆలయ ప్రాంగణంలోకి రావడానికి సుగం దర్శన్ పాస్ చూపించాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.
లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ- ఓం బిర్లాకే మరోసారి ఛాన్స్! వారితో బీజేపీ సంప్రదింపులు