ETV Bharat / bharat

వివాదం నుంచి ప్రాణ ప్రతిష్ఠ వరకు - 500 ఏళ్ల రామమందిరం కలలో అడ్డుంకులెన్నో - అయోధ్య రామమందిర చరిత్ర

Ayodhya Ram Mandir History : కోట్లాది మంది భారతీయుల కల మరి కొద్ది గంటల్లో సాకారం కానుంది. ఎన్నో వివాదాలు, మరెన్నో న్యాయ పోరాటాలను అధిగమించి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ అయోధ్య రామ మందిర వివాదం 1528లో ప్రారంభమైంది. 2019లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ముగిసింది. 1528లో వివాదం ఎలా మొదలైంది? అప్పటి నుంచి రామమందిరం నిర్మాణం కల సాకారం కావడానికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయో తెలుసుకుందాం.

Ayodhya Ram Mandir History
Ayodhya Ram Mandir History
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 6:30 AM IST

Ayodhya Ram Mandir History : అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో మరికొన్ని గంటల్లో శ్రీరాముడు కొలువుదీరనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ అమృత ఘడియల కోసం దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసింది. అయితే ఇదేమీ అంత ఈజీగా సాధ్యం కాలేదు. దీని వెనుక శతాబ్దాల చరిత్రే ఉంది. ఎన్నో పోరాటాలు జరిగాయి. మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయి. అయితే వాటన్నింటిని అధిగమించి రాములోరికి శాశ్వత నివాసాన్ని నిర్మించాలన్న ప్రయత్నం ఎట్టకేలకు నెరవేరనుంది. కోట్లాది హిందువుల కల సాకారమమవుతున్నవేళ, 1528 నుంచి ఇప్పటి జరిగిన కీలక పరిణామాల గురించి ఓ సారి చూద్దాం.

అసలేంటీ అయోధ్య వివాదం?
అయోధ్య వివాదం 1528లో మొదలైంది. ఆ సమయంలో భారతదేశాన్ని మొఘలుల పరిపాలించేవారు. అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్‌గా ఉన్న మీర్ బఖి అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించారు. రామాయణం ప్రకారం రాముడి జన్మస్థలం అయోధ్య రాముడిది అని అంటారు. కమాండర్ ఎక్కడైతే బాబ్రీ మసీదును నిర్మించారో సరిగ్గా అదే చోటే బాలరాముడు జన్మించారని చెబుతారు. అందుకే మసీదు కట్టగానే ఘర్షణలు మొదలయ్యాయి. ఆ తర్వాత 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు జరిగాయి. 1853, 1859లో ఈ గొడవలు తార స్థాయికి చేరాయి. దీంతో అప్పుటి బ్రిటీష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న ఆ ప్రాంతం చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది. మసీదు లోపలి భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది.

స్వాతంత్య్ర వచ్చాక ముదిరిన వివాదం
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1949లో ఈ వివాదం మరింత ముదిరింది. బాబ్రీ మసీదులో కొంతమంది హిందువులు బాలరాముడి విగ్రహం ఉందని చెప్పడం మొదలుపెట్టారు. దీంతో మతపరమైన ఘర్షణలు జరుగుతాయేమోనని అప్పటి ప్రభుత్వం దీనిని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది. దీంతో తలుపులకు తాళాలు పడ్డాయి. 1984లో ఈ స్థలానికి విముక్తి కల్పించి రామమందిరం నిర్మించాలంటూ విశ్వహిందూ పరిషత్ ఉద్యమాన్ని ప్రారంభించింది.

బాబ్రీ మసీద్ కూల్చివేత
1986 ఫిబ్రవరి 1న తాళాలను తీసివేయాలని ఫైజాబాద్ జిల్లా జడ్జి ఆదేశించారు. హిందువులు లోపలకు వెళ్లి పూజలు చేసుకోవచ్చని చెప్పారు. అప్పడే బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం ఏర్పాటైంది. 1990లో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దుతుగా సోమనాథ్​ నుంచి బీజేపీ అగ్రనేత ఎల్​కే ఆడ్వాణీ రథయాత్రను చేపట్టారు. 1992లో డిసెంబర్​ 6న కొంతమంది కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చేశారు. ఇది దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. దీంతో చాలా చోట్ల మత ఘర్షణలు జరిగాయి. అయోధ్యతో పాటు పలు ప్రాంతాల్లో వేలాది మంది చనిపోయారు.

మూడు భాగాలుగా వివాదాస్పద భూమి
మసీదు కింద ఒక నిర్మాణం ఉండేదని 2003లో భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) చేపట్టిన తవ్వకాల్లో తెలిసింది. ఏఎస్​ఐ వెల్లడించిన విషయాన్ని ముస్లింలు విబేధించారు. ఆ తర్వాత 2010 లో వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అలానే సున్నీ వక్ఫ్​బోర్డుకు, నిర్మోహీ అఖాడాకు, రామ్‌లల్లా తరఫు ప్రతినిధులకు కేటాయించాలని ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2011 లో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక 2011 నుంచి 2016 వరకు అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో అనేకమార్లు విచారణ జరిగింది.

2019లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
2019 నవంబరు 9న వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం నిమిత్తం ఒక ట్రస్టుకు కేటాయించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఇచ్చింది. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే ప్రత్యామ్నాయ ప్రదేశంలో 5 ఎకరాల భూమిని కేటాయించింది. 2020 ఫిబ్రవరి 5న రామాలయ నిర్మాణం, నిర్వహణకు 'శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర' ట్రస్టును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2020 ఆగస్టు 5న రామజన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. 2024 జనవరి నాటికి రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జనవరి 22న చేయాలని నిర్ణయించారు. అందుకోసం వేలాది మందికి ఆహ్వాన పత్రికలు పంపించారు. 2024 జనవరి 22న కొత్త బాలరాముడి విగ్రహంతో నూతన ఆలయాన్ని ప్రాంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు.

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ- ఆహ్వానం అందుకున్న దిగ్గజాలు వీరే

పూలు, లైట్లతో అందంగా ముస్తాబైన రామాలయం- అయోధ్యలో భద్రత మరింత పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.