Ayodhya Ram Darshan Break Time : ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో కొలువుదీరి ఉన్న రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పండుగలు, సెలవుల్లో రామనగరికి పర్యటకులు పోటెత్తుతున్నారు. దేశ, విదేశాల నుంచి భక్తజనం వస్తున్నారు. దీంతో ఆలయ దర్శన వేళల్లో ఇటీవలే మార్పులు చేసిన శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
అయోధ్య రామ్‌లల్లా ఆలయంలో బాల రాముడి దర్శనానికి ఇకపై ప్రతిరోజు గంట పాటు విరామం ఇవ్వనున్నట్లు ఆలయ ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు. బాల రాముడికి విశ్రాంతి ఇచ్చేలా శుక్రవారం నుంచి రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంట వరకు ఆలయ ద్వారాలు మూసివేసి ఉంచుతామని చెప్పారు.
"అయోధ్య రామయ్య ఐదేళ్ల బాలుడు. అలా అన్ని గంటల పాటు మెలకువగా ఉండటం వల్ల పడే ఒత్తిడిని తట్టుకోలేరు. అందువల్ల బాల రాముడికి కొంత విశ్రాంతి ఇచ్చేందుకు రోజూ గంట సేపు ఆలయ తలుపులు మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. దీంతో మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు ఆ దేవతామూర్తికి విశ్రాంతి దొరుకుతుంది."
- ఆచార్య సత్యేంద్ర దాస్, రామమందిర ముఖ్యపూజారి
గతనెల 22వ తేదీన రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. ఆ తర్వాత రోజు నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించారు. భారీసంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు పొడిగించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తున్నారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఉండేవి.
IRCTC కొత్త ప్రాజెక్ట్
అయోధ్యకు విచ్చేస్తున్న భక్తులతోపాటు పర్యటకులకు అత్యుత్తమ ఏర్పాట్లు చేసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్- IRCTC ఇటీవలే కీలక నిర్ణయాలు తీసుకుంది. అయోధ్య రైల్వేస్టేషన్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రుచికరమైన వంటకాలను పర్యటకులకు అందుబాటులో ఉంచనుంది ఐఆర్టీసీ. అందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రైల్వే స్టేషన్లోనే అందుబాటు ధరలకు రిటైరింగ్ రూమ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అయోధ్య వాసుల 'సంజీవని'- 120 ఏళ్లుగా 'శ్రీరామ ఆస్పత్రి' సేవలు
అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తున్నారా? ఈ ఐదు విషయాలు తెలుసుకోవడం మస్ట్!