Assam CM on BJP Win 400 Seats : సార్వత్రిక ఎన్నికల సమరంలో బీజేపీ 400 సీట్లు గెలిస్తే అయోధ‌్యలో రామమందిరం నిర్మించినట్లే మథుర, కాశీలో కూడా వైభవోపేతమైన దేవాలయాలు నిర్మిస్తామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలెబట్టుకున్నామని హిమంత గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని హామీలను నెరవేర్చిందని కూడా వెల్లడించారు. బీజేపీకి 300 సీట్లు వచ్చినప్పుడు అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించామని, ఇప్పుడు 400 సీట్లు వస్తే మథురలోని కృష్ణ జన్మభూమి స్థలంలో, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు స్థానంలో దేవాలయాలు నిర్మిస్తామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు.
పీఓకే మనదే
ప్రధాని మోదీ నాయకత్వంలో పాక్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ కూడా భారత్‌లో భాగమవుతుందని హిమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై పార్లమెంటులో ఎలాంటి చర్చలు జరగలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక కశ్మీర్ భారత్‌లో మరొకటి పాక్‌లో ఉందని తమకు చెప్పాలని మన పార్లమెంట్‌లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌పై ఎప్పుడూ చర్చ జరగలేదని తెలిపారు. పీఓకేలో ప్రజలు ప్రతీరోజూ భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని నిరసన తెలుపుతున్నారని హిమంత అన్నారు. రిజర్వేషన్లకు మరింత బలం చేకూర్చేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ కోరుతోందని అది జరగదని స్పష్టం చేశారు.
ఉప రాష్ట్రపతి సుమోటోగా స్పందించాలి
దిల్లీలో బీజేపీ అభ్యర్థి హర్ష్ మల్హోత్రాకు మద్దతుగా జరిగిన బహిరంగ సభలో హిమంత బిశ్వశర్మ పాల్గొని ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై జరిగిన దాడిపై ఉప రాష్ట్రపతి స్వయంగా స్పందించాలని అసోం సీఎం విజ్ఞప్తి చేశారు. దిల్లీ చీఫ్ సెక్రటరీని కేజ్రీవాల్ కొట్టారని గతంలో ఆరోపణ ఉందని, ఇప్పుడు రాజ్యసభ ఎంపీ స్వామి మాలివాల్‌ను కూడా కొట్టారని హిమంత మండిపడ్డారు. రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని హిమంత విజ్ఞప్తి చేశారు.
సొంత భూమి, ఇల్లు, కారు లేని మోదీ- అకౌంట్లో ఎంత ఉందంటే? - PM Modi Property