Arvind Kejriwal On BJP : దేశం వెంట దేవుడు ఉన్నారని, బీజేపీ అధర్మం అంతమై ధర్మం గెలుస్తుందని దిల్లీ సీఎం కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీపై ఆయన విరుచుకుపడ్డారు. జనవరి 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాన్ని కొట్టివేసి ఆప్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను సుప్రీంకోర్టు విజేతగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బుధవారం దిల్లీ శాసనసభలో మాట్లాడిన కేజ్రీవాల్ భగవద్గీతను కోట్ చేస్తూ బీజేపీ అధర్మాన్ని అంతం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నారని అన్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక తీర్పునకు సంబంధించి సుప్రీంకోర్టుకు, సీజేఐకి కృతజ్ఞతలు తెలిపారు. సీజేఐ ద్వారా దేవుడు మాట్లాడినట్లు ఉందని దిల్లీ సీఎం అన్నారు. మరోవైపు రైతుల ఆందోళనకు సంబంధించి కూడా బీజేపీపై విమర్శలు చేసిన కేజ్రీవాల్ వారు దిల్లీ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
-
#WATCH | Delhi CM Arvind Kejriwal says, "The situation in our country is such that there is unrighteousness everywhere. One who built schools & hospitals for people, Manish Sisodia and Satyendar Jain are in jail. People are sad but they (BJP) are confident that they'll win 370… pic.twitter.com/0zZP1JpQo1
— ANI (@ANI) February 21, 2024
'గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుంది'
'జనవరి 30 ఎన్నిక ఫలితాన్ని పక్కనపెడుతూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుంది. ఎమ్మెల్యేలకు ఎరవేయడం, ప్రభుత్వాలను బహిరంగంగా కూల్చివేసే ప్రయత్నాలకు ఆ పార్టీ పాల్పడుతోంది’ అని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆ పార్టీ ఎటువంటి ప్రయత్నాలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు
'ప్రజలు చాలా విచారంగా ఉన్నారు'
'ప్రస్తుతం దేశంలో ప్రతీచోట ఇలాంటి అధర్మమే ఉంది. ప్రజల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించిన మనీష్ సిసోదియా, సత్యేందర్ జైన్లు జైలులో ఉన్నారు. ప్రజలు చాలా విచారంలో ఉండగా, బీజేపీ మాత్రం ఎన్నికల్లో తాము 370 స్థానాల్లో గెలుపొందుతామనే ఆత్మవిశ్వాసంతో ఉంది. ఏదో తప్పు జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. అది ఈవీఎమ్ ఫిక్స్డిడ్ అయినా కావచ్చు మరేదైనా అయి ఉండవచ్చు. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలను కోరుతున్నాను. మిగిలిన విషయాలను ఆ భగవంతుడే చూసుకుంటాడు. మంచి ప్రమాణాలతో కూడిన మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేసిన మనీష్ సిసోదియా జైలులో ఉండగా, మన కుమార్తెలు, చెల్లెలు లాంటి వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన బ్రిజ్ భూషన్ సింగ్ లాంటి వారు తమ రాజకీయ అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు' అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మండిపడ్డారు.
'ఆ 14 స్థానాల్లో మేమే'- గట్టి షాకిచ్చిన కేజ్రీవాల్- ఇండియా కూటమి కుదేల్!