ETV Bharat / bharat

'2-3 రోజుల్లో కేజ్రీవాల్ అరెస్ట్! కాంగ్రెస్- ఆప్​ పొత్తుతో భయపడ్డ బీజేపీ' - అరవింద్ కేజ్రీవాల్​ అరెస్ట్

Arvind Kejriwal ED Arrest : వచ్చే 2-3 రోజుల్లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ను ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని ఆమ్​ ఆద్మీ పార్టీ ఆరోపించింది. కేజ్రీవాల్​ అరెస్టు కోసం అంతా సిద్ధమయ్యిందని చెప్పింది. తాము కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకున్నందుకు బీజేపీ భయపడుతోందని, అందుకే ఈ కుట్ర పన్నుతోందని ఆరోపించింది.

Arvind Kejriwal ED Arrest
Arvind Kejriwal ED Arrest
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 12:17 PM IST

Updated : Feb 23, 2024, 12:49 PM IST

Arvind Kejriwal ED Arrest : లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్​తో తమ పొత్తు ఖరారైన నేపథ్యంలో బీజేపీ భయపడుతోందని ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు ఈడీతో పాటు సీబీఐని కూడా ఉపయోగించుకుంటోందని ఆరోపించింది. ఆప్-కాంగ్రెస్ పొత్తు కుదిరితే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే సందేశాలు వస్తున్నాయని మరో రెండు, మూడు రోజుల్లో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయవచ్చని తెలిపింది.

కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి సీఆర్​పీసీ సెక్షన్ 41ఏ కింద ఇప్పటికే నోటీసులు కూడా సిద్ధమయ్యాయని తమ వద్ద సమాచారం ఉందని దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్​ తెలిపారు. అందుకే కాంగ్రెస్ - ఆప్ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ముగిసినట్లు నివేదికలు రాగానే, కేజ్రీవాల్​కు ఈడీ ఏడోసారి సమన్లు జారీ చేసిందని తెలిపారు. కాంగ్రెస్-ఆప్ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు తుది దశకు చేరుకున్నాయన్న వార్తతో బీజేపీకి నిద్ర పట్టడం లేదని దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆప్​ నేతలు

'కేజ్రీ అరెస్ట్​తో సునామీ వస్తుంది'
కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే ప్రజలు వీధుల్లోకి వస్తారని, ప్రజా సునామీ వస్తుందని, అందులో బీజేపీ కొట్టుకుపోవడం ఖాయమని ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ హెచ్చరించారు. బీజేపీ రాజకీయ సమీకరణాలు తప్పుతాయని జోస్యం చెప్పారు. అరెస్టులకు తాము భయపడటం లేదని, దేశం కోసం కూటమిని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు.

'400 సీట్లు గెలిచే పార్టీ లక్షణాలు ఇలా ఉండవు'
కాంగ్రెస్, ఆప్​ కలిసి పోరాడే రాష్ట్రాల్లో బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతాయని ఆ పార్టీ భావిస్తోందని ఆప్​ విమర్శించింది. తాము 300, 370, 400పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ నేతలు అంటున్నారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి ఉంటే ఇక భయం ఏందుకు? అని ప్రశ్నించింది. 400 సీట్లు గెలిచే పార్టీ లక్షణాలు ఇలా ఉండవని ఎద్దేవా చేసింది.

తుది దశకు కాంగ్రెస్-ఆప్ సీట్ల సర్దుబాటు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమిలో సీట్ల పంపకంపై స్పష్టత వస్తోంది. సీట్ల పంపకంపై కాంగ్రెస్‌తో చర్చలు తుది దశకు చేరుకున్నాయని, అతి త్వరలోనే దానిపై ప్రకటన వెలువడుతుందని ఆప్‌ ప్రకటించింది.
2014, 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ దిల్లీలోని మొత్తం 7 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ రెండు పర్యాయాలు ఆప్​ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇక 2009లో కాంగ్రెస్ మొత్తం 7 సీట్లు గెలుచుకుంది. అంతకుముందు 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​కు 6 సీట్లు రాగా, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది.

కాంగ్రెస్, ఆప్ మధ్య డీల్​ ఫైనల్- దిల్లీలో ఎవరికెన్ని సీట్లంటే?

ఎస్​పీ, కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తు- ఆప్​తో మరో 2రోజుల్లో ఫైనల్​! మరిన్ని రాష్ట్రాలపై ఫోకస్

Last Updated : Feb 23, 2024, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.