ETV Bharat / bharat

క్యాన్సర్ ఉందని ఎమోషనల్ బ్లాక్​మెయిల్- విద్యార్థిని​పై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారం

Allahabad University Student Rape : తనకు క్యాన్సర్​ ఉందని బ్లాక్​మెయిల్​ చేసి, యూనివర్సిటీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడో అసిస్టెంట్​ ప్రొఫెసర్. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అలహాబాద్​ విశ్వవిద్యాలయంలో జరిగింది. బాధితురాలు యూనివర్సిటీ యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినా తొలుత వారు పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్​ చేశాయి.

Allahabad University Student Rape
Allahabad University Student Rape
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 6:35 PM IST

Allahabad University Student Rape : తనకు క్యాన్సర్​ ఉందని మాయమాటలు చెప్పి ఓ విద్యార్థిని లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని ఓ అసిస్టెంట్​ ప్రొఫెసర్. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు. ఈ ఘటనపై బాధితురాలు యూనివర్సిటీ యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ యూనివర్సిటీ మేనేజ్​మెంట్​కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

ఇదీ జరిగింది!
బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఉత్తర్​ప్రదేశ్​లోని అలహాబాద్​ యూనివర్సిటీలో ఓ విభాగంలో అజయ్​ కుమార్ అనే వ్యక్తి అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా పనిచేస్తున్నాడు. అయితే అజయ్​ గత కొద్ది కాలంగా అదే డిపార్ట్​మెంట్​కు చెందిన విద్యార్థినిపై కన్నేశాడు. తనను ప్రేమిస్తున్నట్లు ఆమెకు తెలిపాడు. దీంతో ఆందోళనకు గురైన ఆ విద్యార్థిని అజయ్​కు దూరంగా ఉంటూ వచ్చింది. అయినా అజయ్​ అక్కడితో ఆగలేదు. బాధితురాలికి ఇష్టం లేకున్నా ఆమెకు కాల్స్​, మెసేజ్​లు చేయడం మొదలు పెట్టాడు. ఆమె ఆ నంబర్​ బ్లాక్​ చేసినా, మరో నెంబర్​ నుంచి వేధించేవాడు. అంతేకాకుండా బాధితురాలు క్యాంపస్​లో ఒంటరిగా కనిపిస్తే వేధించేవాడు. అయితే ఇవన్నీ చేసినా బాధిరాలు దూరంగా ఉంటూ వచ్చింది.

'ఎవరికైనా చెబితే చంపేస్తా'
ఇలా అయితే లాభం లేదనుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్, తాను క్యాన్సర్​తో బాధపడుతున్నట్లు బాధితురాలిని ఎమోషనల్ బ్లాక్​మెయిల్​ చేశాడు. ఆ సాకుతో ఆమెతో తరచూ మాట్లాడేవాడు. ఈ క్రమంలో జనవరి 25న అజయ్​ కుమార్​ బాధితురాలిని మార్కెట్​కు పిలిచాడు. అనంతరం ఏదో సాకు చెప్పి తన గదికి తీసుకెళ్లాడు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కాగా, ఈ ఘటనపై లేఖ రాసి యూనివర్సిటీ యాజమాన్యానికి బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనికి వారు స్పందించలేదు. ఆ తర్వాత పోలీసులకు కూడా బాధితురాలు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది.

ఆందోళన తీవ్రతరం!
ఈ ఘటనపై గురించి తెలుసుకున్న యూనివర్సిటీ విద్యార్థులు, అసిస్టెంట్​ ప్రొఫెసర్​పై కేసు పెట్టాలని నిరసనకు దిగారు. దీంతో పాటు ఈ ఘటనపై స్థానిక రాజకీయ పార్టీ ఆజాద్ అధికార సేన స్పందించింది. 48 గంటల్లో నిందితుడిపై కేసు నమోదు చేయకుంటే ఆందోళనకు దిగుతామని ఆ పార్టీ అధికార ప్రతినిది నూతన్ ఠాకూర్​ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్​పై స్పందించిన ప్రయాగ్​రాజ్ డీసీపీ దీపక్ భుకర్, నిందితుడిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టామని తెలిపారు. అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్​ను ఇంకా అరెస్ట్ చేయలేదు. దీంతో విద్యార్థులు క్యాంపస్​లో ధర్నా చేస్తున్నారు. వర్షం పడుతున్నా, చలి తీవ్రంగా ఉన్నా నిరసన కొనసాగిస్తున్నారు. సోమవారం నుంచి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

బాలికపై సామూహిక అత్యాచారం
కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఓ వివాహ వేడుకకు వెళ్లేందుకు రోడ్డుపై నిల్చున్న బాలికను, కారులో వచ్చిన నలుగురు దుండగులు ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. అనంతరం ఇద్దరు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని హల్ద్వానీలో జరిగింది. ఈ ఘటనపై హల్ద్వానీ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. బాలిక ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్​ స్టేషన్​ ఇంఛార్జ్​ ఉమేశ్ మాలిక్ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

ఫ్రెండ్​తో వెళ్లిన బాలికపై గ్యాంగ్​రేప్​- నిందితులకు 90ఏళ్ల జైలుశిక్ష

కూతురిపై కన్నతండ్రి అత్యాచారం - తప్పించుకునే క్రమంలో మరో డేంజర్​లోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.