ETV Bharat / bharat

31ఏళ్ల పాటు గుమస్తాగా వర్క్- కట్​ చేస్తే 52 ఏళ్లకు లాయర్ పట్టా- ఈ అడ్వకేట్ స్టోరీ సో ఇన్స్పిరేషన్​! - Inspirational Story

వయసుతో సంబంధం లేకుండా తన లక్ష్యాన్ని సాధించేందుకు చాలా కష్టపడ్డారు ఓ వ్యక్తి. 31 ఏళ్లుగా గుమస్తాగా పని చేస్తూనే మరోవైపు తన చదువును పూర్తి చేశారు. 52 ఏళ్ల ఏజ్​లో లాయర్ పట్టాను అందుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరో, ఆయన లక్ష్యం ఎలా సాధించారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Advocate Gangadharan Story
Advocate Gangadharan Story (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 9:13 PM IST

చదువుకోవాలనే బలమైన సంకల్పం ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదని నిరూపించారు కేరళకు చెందిన ఓ వ్యక్తి. మూడు దశాబ్దాలుగా లాయర్​ వద్ద గుమస్తాగా పని చేస్తూనే తన చదువును పూర్తి చేశారు. 52 ఏళ్ల వయసులో అనుకున్న లక్ష్యాన్ని సాధించి అడ్వకేట్​గా మారారు. ఇప్పుడు క్లర్క్​గా పనిచేసిన న్యాయస్థానంలోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనే కాసర్​గోడ్​కు చెందిన గంగాధరన్.

Advocate Gangadharan Inspirational Story : కాసర్‌గోడ్‌లోని కోజువల్ పల్లియానికి చెందిన గంగాధరన్ 1992లో కోర్టులో గుమస్తాగా పనిలో చేరారు. అప్పటి నుంచి పలు లాయర్ల వద్ద క్లర్క్ పనిచేస్తూ వచ్చారు. అప్పుడే తాను కూడా ఓ లాయర్​ కావాలని అనుకున్నారు. కానీ కొన్ని పరిస్థితులు కారణంగా గంగాధరన్ చదువుకోవడానికి కుదరలేదు. ఆ కోరిక అలాగే ఉండిపోయింది.

అయితే 2019లో కన్నూర్ యూనివర్సిటీ నుంచి మలయాళంలో బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత 2020లో ఎల్​ఎల్​బీ చేసేందుకు సుల్యాలోని కేవీజీ లా కాలేజీలో చేరారు. ఆ సమయంలో ఓ వైపు క్లర్క్​గా పనిచేస్తూ, మరోవైపు చాలా దూరం ప్రయాణించి కాలేజ్​కు వెళ్లేవారు. అలా ఎల్​ఎల్​బీని కూడా పూర్తి చేశారు. ఇటీవలే అడ్వకేట్​గా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం క్లర్క్​గా పని చేసిన న్యాయస్థానంలోనే లాయర్​గా ప్రాక్టీస్ చేస్తున్నారు.

మరోవైపు, కొందరి జీవితంలో జరిగిన చెడు విషయాలు కూడా వారి జీవితాన్ని మార్చేస్తాయి. అచ్చం అలాగే తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రాజ్ కుమార్ జీవితంలో జరిగింది. ఓ కేసులో అరెస్టై జైలు జీవితం గడిపి మంచి ఆర్టిస్ట్​గా మారారు. ప్రస్తుతం అద్భుతాలు సృష్టిస్తున్నారు. మరెందుకు ఆలస్యం రాజ్ కుమార్ విజయ గాథ ఏంటో తెలుసుకుందాం.

చిన్న తప్పు- మారిన జీవితం!
కోయంబత్తూరు జిల్లా కరమడైకి చెందిన రాజ్ కుమార్ కూలీగా పనిచేసేవారు. 2009లో తనకు తెలిసిన వారి వద్ద బైక్​ను కొన్నారు. అయితే ఆ వాహనానికి సరైన పత్రాలు లేవు. నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయం రాజ్ కుమార్​కు బైక్ కొనుగోలు సమయంలో తెలియదు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక బైక్ అమ్మేందుకు సిద్ధమయ్యారు రాజ్ కుమార్. అప్పుడు బైక్​కు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నట్లు తెలిసింది. అయినా పరిస్థితుల కారణంగా వేరొక వ్యక్తికి ఆ బైక్​ను అమ్మేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.