ETV Bharat / bharat

కేజ్రీవాల్ అరెస్ట్​తో సవాళ్ల సుడిగుండంలో 'ఆప్'- లోక్​సభ ఫలితాలపై గట్టి ఎఫెక్ట్! - AAP Situation After Kejriwal Arrest

AAP Situation After Kejriwal Arrest : దిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) క్యాడర్‌ను డైలమాలోకి నెడుతోంది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్‌లో నెలకొన్న నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల ప్రభావం వల్ల త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మునుపటి రేంజులో ఆప్ ఫలితాలను సాధించే అవకాశాలు ఉండవని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే అదనుగా దిల్లీ, పంజాబ్‌లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభిస్తే ఆప్ మరింత సంక్షోభంలో కూరుకుపోయే రిస్క్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Big Blow to AAP
Big Blow to AAP
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 5:09 PM IST

AAP Situation After Kejriwal Arrest : దిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు దేశంలోని రెండు రాజకీయ పార్టీలకు పెను సవాళ్లు విసురుతోంది. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఈ ఎన్నికల వేళ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుతో బీఆర్ఎస్ అధినాయకత్వం ఒత్తిడిలోకి వెళ్లింది. ఎన్నికల వ్యూహరచన చేయాల్సిన ఈ తరుణంలో కేసీఆర్ కుటుంబం దృష్టి అంతా కవితకు న్యాయ సహాయం అందించడంపైకి మళ్లింది.

మరోవైపు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఈడీ అరెస్టు చేయడం వల్ల ఆప్‌ క్యాడర్ సైతం డైలమాలో పడిపోయింది. 2023 ఫిబ్రవరిలో అరెస్టయిన ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు అరెస్టైన కేజ్రీవాల్ పరిస్థితేంటి ? ఆయన కూడా దీర్ఘకాలం పాటు జైల్లోనే ఉండాల్సి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్ ఏంటి ? దిక్సూచిగా నిలిచే కేజ్రీవాల్ లేకుండా పార్టీ మునుపటి ఉత్సాహంతో ముందుకు సాగగలదా ? అనే సందేహం ఆప్ వర్గాల్లో తలెత్తుతోంది.

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అమలుచేస్తే!
అరవింద్ కేజ్రీవాల్‌ తన విజన్‌కు అనుగుణంగా ఆప్‌ను జాతీయ పార్టీ స్థాయికి తీసుకొచ్చారు. దిల్లీ, పంజాబ్, హరియాణా, గుజరాత్‌లో చెప్పుకోదగిన స్థాయిలో ఆప్ క్యాడర్ ఇప్పుడు ఉందంటే దానికి కారణం- కేజ్రీవాల్ విజన్ !! ఆయన జైల్లోనే ఉంటే ఆప్‌ బలంగా నిలబడుతుందా ? బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహం ధాటికి తడబడుతుందా ? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.

ఎన్నికల వేళ ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకులను బీజేపీ తమ గూటిలో చేర్చుకుంటోంది. త్వరలో ఇదే ప్లాన్‌ను ఆప్ బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే సీన్ మారిపోతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ అనుకున్న రేంజులో ఫలితాలను సాధించే అవకాశాలు ఉండవని విశ్లేషిస్తున్నారు.

కేజ్రీవాల్ స్థాయి నాయకుడు లేని లోటు!
దిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో సీఎంగా మరో సీనియర్ నేతకు ఒకవేళ అవకాశాన్ని ఇచ్చినా దాని ప్రభావం దిల్లీ వరకే పరిమితం అవుతుంది. జాతీయ స్థాయిలో ఆప్‌‌కు దిశానిర్దేశం చేసే నాయకత్వ పటిమ కలిగిన నాయకులు ఇప్పటికప్పుడు ఆప్‌లో ఎవరూ లేరనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. ప్రత్యేకించి ఆప్ ఒంటరిగా 13 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో బీజేపీ నుంచి పెద్ద సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కేజ్రీవాల్ అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ ఇతర విపక్ష పార్టీలతో కలిసి ముందుకు సాగడమే ఆప్‌కు మేలు చేకూరుస్తుందని సూచిస్తున్నారు. పంజాబ్, దిల్లీలోని ఆప్ ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేస్తూ జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీని ముందుకు నడపగల నాయకత్వం ప్రస్తుతం లేదనే విషయం వాస్తవం. దీని ప్రభావాన్ని కచ్చితంగా త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు, 2025 ఫిబ్రవరిలో జరగబోయే దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ చవిచూస్తుందని భావిస్తున్నారు. ఈ కష్టకాలాన్ని ఒకవేళ కేజ్రీవాల్ సేన విజయవంతంగా ఎదురీదగలిగితే రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో దాని వికాసానికి దారులు తెరుచుకుంటాయి.

అవినీతి వ్యతిరేక పోరాటం నుంచి మద్యం స్కామ్​లో అరెస్ట్​- కేజ్రీ వారసత్వం ఎవరికో? - Kejriwal ED Arrest

అరవింద్ కేజ్రీవాల్​ అరెస్టు 'కర్మ' ఫలితమే! : అన్నా హజారే - Anna Hazare On Kejriwal Arrest

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.