ETV Bharat / bharat

ఆప్​ అంతం చేయడమే బీజేపీ లక్ష్యం- భయంతో 'ఆపరేషన్‌ ఝాడు': కేజ్రీవాల్ - AAP Leaders Protest - AAP LEADERS PROTEST

AAP Leaders Protest : ఆమ్​ ఆద్మీ పార్టీని నాశనం చేయాలని బీజేపీ చూస్తుందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్​ను అణిచివేసేందుకే బీజేపీ 'ఆపరేషన్‌ ఝాడు'ను ప్రారంభించిందని తెలిపారు. మరోవైపు బీజేపీ కార్యాయల ముట్టడి చేసేందుకు వెళ్తున్న ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆప్​ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

AAP Leaders Protest
AAP Leaders Protest (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 1:18 PM IST

Updated : May 19, 2024, 2:27 PM IST

AAP Leaders Protest : ఆమ్‌ఆద్మీ పార్టీని అంతం చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ఆరోపించారు. బీజేపీకి ఆప్​ భవిష్యత్తులో సవాలుగా మారుతుందన్న భయంతోనే 'ఆపరేషన్‌ ఝాడు'ను ప్రారంభించిందని అన్నారు. ఆప్‌ నేతల ఆరెస్టులకు నిరసనగా బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు ముందు తమ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు

"ఆప్​ ఎదుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన చెందుతున్నారు. పార్టీ చాలా వేగంగా అభివృద్ది చెందింది. ఆప్​ను అణిచివేసేందుకే ఆపరేషన్‌ ఝాడును బీజేపీ ప్రారంభించింది. రానున్న కాలంలో ఆప్​ నేతలను అరెస్ట్ చేస్తారు. బీజేపీకి ఆప్​ పెద్ద సవాల్​గా మారుకుండా ఉండేందుకు భవిష్యత్తులో మా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారు. పార్టీ కార్యాలయాన్ని మూసి వేసి వీధుల్లోకి తీసుకొస్తారు. మున్ముందు మనకు పెద్ద సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండండి" అంటూ కేజ్రీవాల్ ప్రసంగించారు.

అడ్డుకున్న పోలీసులు!
మరోవైపు, ఆమ్​ఆద్మీ పార్టీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. తమ పార్టీ నేతల అరెస్ట్​కు నిరసనగా బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ఆప్​ యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఇతర నేతలు ఆప్‌ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆప్​ ఆందోళన పిలుపుతో దిల్లీలోని పండిట్ దిన్​దయాల్ ఉపాధ్యాయ మార్గ్‌లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ఐటీవో మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యలయానికి వచ్చిన ఆప్​ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

'నిందితులను కాపాడేందుకే నిరసనలు'
ఆమ్ ఆద్మీ పార్టీ​ తలపెట్టిన నిరసనను ఉద్దేశించి​ ఎంపీ స్వాతీ మాలీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. 'ఒకప్పుడు నిర్భయకు న్యాయం చేయాలని మనమంతా వీధుల్లోకి వచ్చాం. 12 ఏళ్ల తర్వాత ఈరోజు సీసీటీవీ ఫుటేజీని మాయం చేసి, ఫోన్‌ను ఫార్మాట్‌ చేసిన నిందితుణ్ని కాపాడేందుకు వీధుల్లోకి వస్తున్నామా? ఈ మాత్రం చొరవ మాజీ మంత్రి మనీశ్ సిసోదియా విషయంలో చూపి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. ఆయనే బయట ఉంటే ఈరోజు నాకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు' అని మాలీవాల్ ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

స్వాతిపై దాడి కేసులో బిభవ్ కుమార్​కు 5రోజుల పోలీస్ కస్టడీ- ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు! - Swati Maliwal assault case

పోలింగ్​కు ముందు రెచ్చిపోయిన ఉగ్రవాదులు- మాజీ సర్పంచ్ మృతి, టూరిస్ట్​లకు గాయాలు - Terrorist Attacks In Kashmir

Last Updated : May 19, 2024, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.