Delhi Heavy Rains : దేశ రాజధాని దిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1లోని ఓ పైకప్పు కూలిపోయి ఒకరు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు పైకప్పు కింది పార్క్ చేసిన ట్యాక్సీలు సహా అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పైకప్పు కూలినట్లు తమకు ఉదయం 5:30 గంటల సమయంలో సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు.
#UPDATE | 6 people injured after a roof collapsed at Terminal-1 of Delhi airport: Atul Garg, Fire Director https://t.co/r0ikZqMq9N
— ANI (@ANI) June 28, 2024
విమాన సర్వీసులు నిలిపివేత
అయితే, టెర్మినల్ 1లోని పైకప్పు కూలడం వల్ల విమాన రాకపోకలపైనా ప్రభావం పడింది. టెర్మినల్ 1 నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా దృష్ట్యా చెకిన్ కౌంటర్లు మూసివేసినట్లు చెప్పారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. "నేను బెంగళూరు వెళ్తున్నాను. నాకు ఉదయం 8.15గంటలకు విమానం ఉంది. కానీ సుమారు 5 గంటల సమయంలో పైకప్పు కూలిపోయింది. ఫ్లైట్ విషయంలో అధికారులను అడిగితే సమాధానం ఇవ్వడం లేదు" అని ఓ ప్రయాణికుడు చెప్పారు.
DIAL (Delhi International Airport Limited) spokesperson says, " due to heavy rain since early this morning, a portion of the canopy at the old departure forecourt of delhi airport's terminal 1 collapsed around 5 am. there are injuries reported, and emergency personnel are working… pic.twitter.com/6MNNY8M3SX
— ANI (@ANI) June 28, 2024
#WATCH | Heavy overnight rainfall leaves several parts of Delhi waterlogged. Visuals from Mandawali area. pic.twitter.com/UBUCidfoOS
— ANI (@ANI) June 28, 2024
స్వయంగా పర్యవేక్షిస్తున్నా : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
మరోవైపు దిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ ఘటనను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. టెర్మినల్-1 వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని చేయాలని విమానయాన సంస్థలకు ఆదేశించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 20 లక్షలు, గాయపడ్డ వారికి 3లక్షల పరిహారం ప్రకటించారు.
దిల్లీలో భారీ వర్షం
దిల్లీలోని అనేక ప్రాంతాల్లో వరుసగా రెండోరోజూ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు భీకర ఎండలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. కానీ, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
#WATCH | A car submerged in water and roads heavily flooded due to continues downpour in Delhi
— ANI (@ANI) June 28, 2024
(Visuals from Minto Road) pic.twitter.com/tsE2QJYuGH
#WATCH | Heavy rainfall causes waterlogging in several parts of Delhi-NCR
— ANI (@ANI) June 28, 2024
(Visuals from Noida Sector 95) pic.twitter.com/eky6UvPYg3