150 Years Imprisonment To Father : ఇంట్లో ఎవరూ లేని సమయంలో సొంత మైనర్ కూతురిపైనే పలుమార్లు అత్యాచారం చేసిన 42 ఏళ్ల ఓ కీచక తండ్రికి ఏకంగా 150 ఏళ్ల జైలు శిక్ష విధించింది కేరళ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు. ఐపీసీ సహా ఇతర చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద ఈ కఠిన శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది పెరింతల్మన్నలోని ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు-2.
దోషికి ముగ్గురు భార్యలు
మైనర్ కుమార్తెపై సొంత తండ్రే అఘాయిత్యానికి ఒడిగట్టిన ఈ ఉదంతం మలప్పురం జిల్లాలోని కలికావు పోలీస్‌స్టేషన్ పరిధిలో 2022లో జరిగింది. దోషికి ముగ్గురు భార్యలు. వీరిలో ఒక భార్య కుమార్తెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు తండ్రి. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు పోక్సో, ఐపీసీ, జువైనల్ చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద మొత్తం 150 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం
16 ఏళ్లలోపు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినందుకు గానూ ఐపీసీ 376 (3) కింద 30 ఏళ్లు. 16 ఏళ్లలోపు బాలికపై లైంగిక దాడి చేసినందుకు గానూ పోక్సో చట్టంలోని సెక్షన్ 4 (2) కింద 30 ఏళ్ల జైలు శిక్ష. అనేక మార్లు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినందుకు, సొంత కుటుంబసభ్యుడే అత్యాచారానికి పాల్పడిన నేరానికి పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 40+40 ఏళ్ల చొప్పున శిక్షను విధించారు న్యాయమూర్తి. జువైనల్ చట్టం కింద గృహంలోకి అక్రమంగా చొరబడినందుకు 7 ఏళ్లు, బాలికపై క్రూరంగా ప్రవర్తించినందుకు మరో మూడేళ్లు మొత్తం కలిపి 10 ఏళ్లు శిక్ష వేసింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని కోర్టు ఆదేశించింది. దీంతో శిక్షల్లో గరిష్ఠ శిక్ష అయిన 40 ఏళ్ల జైలు దోషికి వర్తిస్తుందని కోర్టు తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసిన ఆర్డర్ కాపీలో స్పష్టంగా చెప్పింది. అదనంగా రూ.4 లక్షలను జరిమానా రూపంలో కోర్టుకు చెల్లించాలని ఆదేశించింది. ఇందులో రూ.2 లక్షలు బాధితురాలికి పరిహారంగా ఇవ్వాలని పేర్కొంది.
128 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
కేరళలోని కోజికోడ్ జిల్లాలో కూడా అచ్చం ఇలాంటి ఘటన వెలుగు చూసింది. 2020-21 మధ్య కాలంలో మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన కోజికోడ్‌లోని కల్లాయి ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల ఇలియాస్ అహ్మద్ అనే నిందితుడికి 128 ఏళ్ల జైలు శిక్ష పడింది. కోర్టుకు రూ.6.60 లక్షల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోజికోడ్ పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజీవ్ జయరాజ్ తీర్పునిచ్చారు. జరిమానాను చెల్లించలేని పక్షంలో అదనంగా మరో 6 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు.
సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం
'ఇండియా' కూటమికి నీతీశ్ గుడ్ బై? NDAలోకి ఎంట్రీ! అదే కారణమా?