Jawan Day 6 Box Office Collection :బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా రోజుకో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన రోజు నుంచే థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా ఆరో రోజుఅన్ని భాషలకు కలిపి రూ. 28.50 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు రూ. 75 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ ఆ తర్వాత రూ. 53.23 కోట్లు, రూ.77.83 కోట్లు, రూ.80.1 కోట్లు, రూ.32.92 కోట్లు, రూ.30 కోట్లు ఇలా పెద్ద మొత్తంలో వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ రూ. 574.89 కోట్లకు పైగా వసూలు చేసి 600 కోట్ల క్లబ్‌లోకి చేరేందుకు సిద్ధమైంది.
Jawan Cast : భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జవాన్' సినిమాకు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో షారుక్ లుక్ కొత్తగా ఉందని, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయంటూ సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో షారుక్‌కు జోడీగా తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా.. విజయ్ సేతుపతి, సీనియర్ నటి ప్రియమణి , బాలీవుడ్ నటి సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించి ఆడియెన్స్‌ను మెప్పించారు. దీపికా పదుకొణె, సంజయ్ దత్ లాంటి స్టార్స్ అతిథి పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.
Jawan Day 5 Box Office Collection :బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్- అట్లీ కాంబినేషన్లో తెరకెక్కిన 'జవాన్' మూవీ.. రిలీజైన రోజు నుంచి రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు రూ. 75 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. క్రమ క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది. ఇక ఐదో రోజు ఈ సినిమా ఇండియాలో రూ.30 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమచాారం.