జియో Vs ఎయిర్‌టెల్ Vs వీఐ ప్లాన్స్ ధరలు పెంపు - ఇకపై వారికి మాత్రమే 5జీ! - JIO VS AIRTEL VS VI PLANS 2024 - JIO VS AIRTEL VS VI PLANS 2024
Jio Vs Airtel Vs Vi Plans : ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా (VI) సంస్థలు తమ మొబైల్ ప్లాన్ల ధరలను భారీగా పెంచాయి. అంతేకాదు ఇప్పటి వరకు ఉచితంగా, అపరిమితంగా ఇస్తున్న 5జీ డేటాపై కూడా పరిమితులు విధించాయి. పూర్తి వివరాలు మీ కోసం.
jio vs airtel vs vi plans comparison 2024 (ETV Bharat)
Jio Vs Airtel Vs Vi Plans : ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా (VI) తమ మొబైల్ టారిఫ్ ధరలను భారీగా పెంచాయి. తొలుత జియో మొబైల్ ప్లాన్ల ధరలు పెంచగా, ఎయిర్‌టెల్, వొడాఫోన్లు కూడా అదే బాటపట్టాయి. జియో, ఎయిర్‌టెల్ సవరించిన ప్లాన్లు ఈ జులై 3 నుంచి అందుబాటులోకి రానున్నాయి. వొడాఫోన్-ఐడియా (వీఐ) ప్లాన్లు జులై 4 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఈ లోపు రీఛార్జ్ చేసుకున్న వారికి పాత ధరలే వర్తిస్తాయి.
జియో ఛార్జీలు పెంచిన నేపథ్యంలో 28 రోజుల ప్లాన్ కనీస రీఛార్జ్ మొత్తం రూ.189కు చేరింది. ఇదే 28 రోజుల ఎయిర్‌టెల్, వీఐ ప్లాన్లు రూ.199కు పెరిగాయి.
ఈ మూడు టెలికాం కంపెనీలకు చెందిన 56 రోజుల మొబైల్ ప్లాన్ల ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి.
84 రోజుల ప్లాన్‌ల ధర విషయానికి వస్తే, జియో ప్లాన్ ధర రూ.666 నుంచి రూ.799కి పెరిగింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా (వీఐ) ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు రూ.719 నుంచి ఏకంగా రూ.859కు చేరుకున్నాయి. అంతేకాదు డేటా ప్లాన్స్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ధరలు కూడా భారీగా పెరిగాయి.
ఇకపై నో ఫ్రీ 5జీ డేటా! జియో, ఎయిర్‌టెల్‌లు ఇప్పటి వరకు అందరు యూజర్లకు 5జీ డేటాను ఉచితంగా, అపరిమితంగా ఇస్తూ వస్తున్నాయి. కానీ ఇకపై 5జీ డేటాపై పరిమితులు విధిస్తున్నట్లు తెలిపాయి. ఎవరైతే 2 జీబీ కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తారో, వారికి మాత్రమే అపరిమిత 5జీ డేటాను అందించున్నట్లు స్పష్టం చేశాయి. దీని వల్ల ఇకపై 5జీ ఫోన్ ఉండి అపరిమిత డేటా ఆనందించాలంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అంటే జియో యూజర్లు 84 రోజులకుగాను రూ.859తోనూ, ఎయిర్‌టెల్ యూజర్లు రూ.979 రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది.