ETV Bharat / entertainment

'కోటా ఫ్యాక్టరీ-3' నచ్చిందా? ఈ బెస్ట్​ ఇన్​స్పిరేషనల్​ సిరీస్​లను ఓ లుక్కేయండి! - Inspirational Web Series OTT

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 7:22 PM IST

Best Inspirational Web Series OTT : విద్యార్థుల జీవితాలు, కలలు సాకారం చేసుకోవడానికి పడే కష్టాలు, సామాజిక పరిస్థితులను చర్చించే, కొత్త ఆలోచనలు రేకెత్తించే కథలు మీకు ఇష్టమా? ఈ నేపథ్యంలో వచ్చిన మీకు కోటా ఫ్యాక్టరీ సీజన్‌ 3 చూశారా? అయితే ఈ ఇన్స్​స్పిరేనల్ సిరీస్​లను కూడా ఓ లుక్కేయండి.

Inspirational Web Series OTT
Inspirational Web Series OTT (Getty Images)

Best Inspirational Web Series OTT : ఎక్కడ చూసినా ఇటీవలే విడుదలైన కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 గురించే టాక్ నడుస్తోంది. రాజస్థాన్‌లోని కోటాలో ఐఐటీ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కి ప్రిపేర్‌ అయ్యే విద్యార్థుల జీవితాలను ఇందులో చూపించారు మేకర్స్​. ఇందులోని సిరీస్‌లోని పాత్రలు, ఎదుర్కొంటున్న భావోద్వేగ, విద్యాపరమైన ఒత్తిళ్లు మనసును కలిచివేస్తాయి.

మొదటి రెండు సీజన్లలో ఐఐటీ ఎంట్రెన్స్‌కి సిద్ధమవుతున్న వైభవ్ పాండే, ప్రియమైన ఉపాధ్యాయుడు జీతు భయ్యా చుట్టూ తిరుగుతుంది. సీజన్ 3 IIT కోచింగ్ సవాళ్లను అన్వేషించడానికి కొనసాగుతుంది. మీరు కోటా ఫ్యాక్టరీ సీజన్ 3ని ఆస్వాదించి ఉంటే, అలాంటి కొన్ని షోలు వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరూ ఓ లుక్కేయండి.

ఎలైట్ (నెట్‌ఫ్లిక్స్) : ఇది ఒక ఎక్స్‌క్లూజివ్‌ ప్రైవేట్ స్కూల్‌ విద్యార్థుల జీవితాలకు సంబంధించిన స్పానిష్ థ్రిల్లర్. క్లాస్‌ డివైడ్‌, ప్రత్యేక హక్కు, డార్క్‌ సీక్రెట్‌ నేపథ్యంలో కొనసాగుతుంది. స్పెయిన్‌లోని ఒక ఎలైట్ ప్రైవేట్ స్కూల్‌లో చేరిన ముగ్గురు వర్కింగ్‌-క్లాస్‌ యువకుల చుట్టూ తిరుగుతుంది. సంపన్న విద్యార్థులతో వారికి జరిగే గొడవలు, చివరికి హత్యలకు దారి తీయడం ఉత్కంఠ రేపుతుంది. టీనేజ్‌ రిలేషన్స్‌, అసూయ, ఆశయాల సంక్లిష్టతలను ప్రదర్శిస్తుంది.

లఖోన్ మే ఏక్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) : ఈ సిరీస్‌ ఆకాష్ గుప్తా అనే యువకుడికి సంబంధించింది. అతను సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్​గా మారాలని కలలు కంటుంటే, వైద్య ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తుంటారు. దీంతో ఓ స్ట్రిక్ట్‌ డైరెక్టర్ నిర్వహిస్తున్న కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో అయిష్టంగానే చేరుతాడు. అక్కడ అతడి లైఫ్​ ఎలా సాగిందనే విషయాన్ని ఈ సిరీస్​లో చూపించారు. ఇప్పటి వరకు ఈ సిరీస్​ రెండు సీజన్లుగా విడుదలైంది.

సెలక్షన్‌ డే (నెట్‌ఫ్లిక్స్) : అరవింద్ అడిగా రాసిన సెలక్షన్​ డే నవల ఆధారంగా ఈ సిరీస్‌ రూపొందించారు. క్రికెట్ స్టార్లు కావాలనుకునే ఇద్దరు సోదరుల చుట్టూ కథ తిరుగుతుంది. ముంబయి మురికివాడలోని ఉండే ఆ ఇద్దరూ తమ కుటుంబ అంచనాలు, వ్యక్తిగత కలలు, క్రీడల పోటీ ప్రపంచంలో ఎదుర్కొనే అనుభవాలను మేకర్స్ ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు.

పిచర్స్ (జీ5) : ఈ షో చాలా మంది భారతీయులకు కనెక్ట్ అవుతుంది. అందుకే యువతలో చాలా మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. నవీన్, జితు, యోగి, మండల్ అనే నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. తమ బిజినెస్‌ వెంచర్‌ను ప్రారంభించాలనే కలను సాకారం చేసుకోవడానికి, ఉద్యోగాలను వదిలేస్తారు. ఈ సిరీస్‌లో ఎంట్రప్రెన్యూర్స్‌ కష్టాలు, విజయాలను స్ఫూర్తిదాయకంగా, ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. కలలను సాకారం చేసుకోవడంలో ప్రతి పాత్ర జర్నీ ఇన్‌స్పైర్‌ చేస్తుంది. ఫన్నీ డైలాగులు, స్ట్రాంగ్‌ పెర్మామెన్స్‌ల కోసం కచ్చితంగా సిరీస్‌ చూడాలి.

యాస్పిరెంట్స్‌ (అమెజాన్‌ ప్రైమ్‌) : ఈ సిరీస్‌ ప్రధానంగా యూపీఎస్పీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభిలాష్, గురి, ఎస్‌కే అనే ముగ్గురు స్నేహితుల జీవితాలకు సంబంధించింది. భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకదాన్ని ఛేదించడంలో వాళ్లు ఎదుర్కొనే ఒత్తిడి, సంకల్పాన్ని చూపిస్తారు. సివిల్స్‌ ఔత్సాహికుల జీవితాలు, నాటకీయత, హాస్యాన్ని చక్కగా బ్యాలెన్స్‌ చేశారు. సామాజిక ఒత్తిళ్ల మధ్య ఒకరి కలలను కొనసాగించడంలో ఉంటే కష్టాలను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.

స్కామ్ (నెట్‌ఫ్లిక్స్) : సామాజిక ఒత్తిళ్లు, సంబంధాలు, వ్యక్తిగత గుర్తింపుతో వ్యవహరించే ఉన్నత పాఠశాల విద్యార్థుల జీవితాలను అన్వేషించే నార్వేజియన్ టీన్ డ్రామా. ఇది మానసిక ఆరోగ్యం, లైంగికత, సామాజిక అంచనాలను నిజాయతీగా చర్చిస్తుంది. రియలిస్టిక్‌ క్యారక్టెర్లు, ఇన్నోవేవిట్‌ స్టోరీ టెల్లింగ్‌ నచ్చుతుంది.

వీకెండ్ స్పెషల్ - ఉత్కంఠగా సాగే టాప్ 10 క్రేజీ వెబ్​సిరీస్​ ఇవే! - Top 10 OTT Web Series

ఈ వారం 15 క్రేజీ సినిమా/సిరీస్​లు - మీ ఛాయిస్ ఏంటి? - This Week OTT Releases

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.