Tips To Get Rid Of Houseflies : వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈగలు ఇళ్లపై దండయాత్ర చేస్తాయి. వంటగది, బాత్‌రూమ్, హాల్‌లో ఎక్కడ చూసినా ఈగలే కనిపిస్తాయి. ఈగల మోతతో చిరాకు వస్తుంది. తినే ఆహార పదార్థాలపై వాలడం వల్ల ఫుడ్ పాడవుతుంది. ఈ ఆహారం తినడం వల్ల కలరా, డయేరియా వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే.. ఈగలను తరిమికొట్టడానికి కొంతమంది మార్కెట్‌లో దొరికే ఏవేవో కెమికల్స్ ఉండే స్ప్రేలను వాడుతుంటారు. కానీ, రసాయనాలు ఉండే వీటిని వాడటం హెల్త్‌కు మంచిది కాదు! ఇంట్లోనే లభించే నేచురల్ టిప్స్ పాటించడం ద్వారా ఈజీగా వీటిని తరిమికొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఉప్పు నీళ్లు :
ఒక స్ప్రే బాటిల్‌లో నీళ్లు నింపి.. అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కలపండి. ఈ లిక్విడ్‌ను ఈగలు (Houseflies) ఉండేచోట స్ప్రే చేయండి. అలాగే ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు.. చివరిగా ఉప్పునీటితో ఫ్లోర్‌ను తుడిచినా కూడా మంచి ఫలితం కనిపిస్తుందని నిపుణులంటున్నారు. కర్పూరం పొడి :
దాదాపు ప్రతి ఇంట్లో కర్పూరం బిళ్లలుంటాయి. కొన్ని కర్పూరం బిళ్లలను మెత్తగా పొడి చేయండి. తర్వాత ఈ పొడిని నీళ్లలో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపండి. ఈగలు ఎక్కువగా వాలే చోట దీనిని స్ప్రే చేయండి. ఇలా చేస్తే మీకు ఒక్క ఈగ కూడా కనిపించదు! 2013లో "జర్నల్ ఆఫ్ ఎంటోమాలజీ" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. కర్పూరం పొడి ఈగలను తరిమికొట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. కర్పూరం పొడి చల్లిన ప్రాంతంలో ఈగల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. ఈ పరిశోధనలో దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ 'డాక్టర్ అశోక్ కుమార్' పాల్గొన్నారు.
తులసి ఆకుల పేస్ట్ :
కొన్ని తులసి ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్‌ను నీళ్లలో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపండి. ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో రోజుకు రెండు సార్లు స్ప్రే చేయండి. అంతే ఇలా చేస్తే ఈగలు అస్సలు కనిపించవు.
బిగ్ అలర్ట్: ఆహారాన్ని ఇలా వండుతున్నారా? క్యాన్సర్ ముప్పు తప్పదంటున్న నిపుణులు!
దాల్చినచెక్క పౌడర్ :
ఈగలను తరిమికొట్టడానికి దాల్చినచెక్క కూడా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా కొన్ని దాల్చినచెక్కలను తీసుకుని మిక్సీలో వేసి పొడి చేసుకోండి. ఈ పౌడర్‌ను ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉండే చోట కొద్దిగా చల్లండి. దాల్చినచెక్క వాసనకు ఈగలు అస్సలు ఉండవు!
పాలు, మిరియాలు :
గ్లాసు పాలలో టేబుల్‌స్పూన్ నల్ల మిరియాలు, 2 టీస్పూన్ల చక్కెర వేసి బాగా కలపండి. ఈ గ్లాసును ఈగలు ఎక్కువగా ఉండేచోట పెట్టండి. అంతే.. గ్లాసులో ఈగలు పడి చనిపోతాయి!
వెనిగర్‌తో :
గిన్నెలో యాపిల్ సిడార్ వెనిగర్ తీసుకుని.. ఇందులో కొన్ని చుక్కల యాకలిప్టస్ ఆయిల్ కలపండి. తర్వాత ఒక స్ప్రే బాటిల్‌లో ఈ లిక్విడ్‌ను పోసి ఈగలు ఎక్కువగా ఉన్నచోట స్ప్రే చేయండి. ఇలా డైలీ రెండుసార్లు స్ప్రే చేస్తే ఈగలను ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు.
బిర్యానీ ఆకులు :
ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉన్నప్పుడు.. రెండు బిర్యానీ ఆకులను కాల్చి అవి ఉన్నచోట పెట్టండి. బిర్యానీ ఆకుల పొగకు ఈగలు పారిపోతాయి.
మీ పెదాల చుట్టూ ఇలా నల్లగా మారిందా? - ఇలా చేస్తే పాలరాతి అందం మీ సొంతం!
రోడ్డు మీద కనిపించే ఈ పండ్లను లైట్ తీస్కోకండి - లివర్, షుగర్ నుంచి గుండె సమస్యల దాకా ఒకే బాణం!