ETV Bharat / spiritual

లవర్స్​కు గుడ్​న్యూస్​- ఈవారం ఈ రాశుల వారికి మ్యారేజ్​ ఫిక్స్​! - Weekly Horoscope

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 5:01 AM IST

Weekly Horoscope From 30th June to 6th July 2024 : 2024 జూన్​ 30వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope From 30th June to 6th July 2024
Weekly Horoscope (ETV Bharat)

Weekly Horoscope From 30th June to 6th July 2024 : 2024 జూన్​ 30వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసి గొప్ప విజయాలను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ప్రభుత్వ పరంగా నిలిచి ఉన్న పెండింగు డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చమవుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు, ఆదాయ వృద్ధి వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి, నిరుద్యోగులకు ఆశించిన శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వివాహబంధంతో ఒక్కటవుతారు. ఉద్యోగులకు ప్రమోషన్, బదిలీకి అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ వారం విశేషమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు మెరుగవుతాయి. వ్యాపారులు వారం మొదటి భాగంలో పెట్టుబడి పెట్టడం అంత మంచిది కాదు. వారం మధ్యలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. దూరప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్థిరాస్తి రంగం వారికి అదృష్టం వరిస్తుంది. నూతన ప్రాజెక్టులను చేపడతారు. విద్యార్థులు చదువు పట్ల మరింత ఏకాగ్రత పెడితే మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శివారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప విజయాలను అందుకుంటారు. వ్యాపారులకు పనిలో పురోగతి ఉంటుంది. పెట్టుబడుల మీద రాబడి కూడా బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. ప్రమోషన్ కోసం మీ పేరు రెకమండ్ చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిపుణులకు, వ్యాపారస్తులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికినీ సమర్థతతో అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి యోగం ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. గృహంలో శాంతి సంతోషం నెలకొంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. వ్యాపారస్తులకు ప్రయాణాలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. దూర ప్రాంతాలనుంచి శుభవార్తలు అందుకుంటారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, వ్యాపారులు వృత్తి పరంగా మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. నూతన అవకాశాలను అందుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. గృహంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. వృధా ఖర్చులు ఉండవచ్చు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల రూపంలో ధనాదాయం ఉంటుంది. సమాజానికి మేలు చేసే పనులు చేపడతారు. స్థిరాస్తి రంగం వారు నూతన వెంచర్ల మొదలు పెడతారు. విద్యార్థులు విద్యాపరంగా గొప్ప విజయాలు సాధిస్తారు. ఆరోగ్యంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి అస్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం దెబ్బ తింటుంది. తగిన విశ్రాంతి అవసరం. సహోద్యోగులు, ఉన్నతాధికారుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు సమయానుకూలంగా నడుచుకుంటే వ్యాపారంలో పురోగతి సాధించవచ్చు. ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూసుకోండి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపండి. నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వలన ఆపదలు తొలగిపోతాయి.

.

తుల (Libra) : తులరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి శ్రమకు తగిన ఫలం ఉండకపోవచ్చు. వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలోనూ తరచూ ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబంలో కలహాలు, మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. వ్యాపారులు స్వల్ప విజయాలను చూస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగులకు పని ప్రదేశంలో వ్యతిరేకత ఎదురవుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం ఆందోళనకు గురి చేస్తుంది. వ్యాపారులకు సాధారణమైన ఫలితాలే ఉంటాయి. ఖర్చులు స్వల్పంగా పెరిగినప్పటికీ ఆదాయం సంతృప్తికరంగా కొనసాగుతుంది. సాంకేతిక అధ్యయనాలు విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలం. శివారాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో ఊహించని మార్పులు, అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేయలేక పోతారు. ఉన్నతాధికారుల నుంచి సమస్యలు ఉండవచ్చు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలం. అయితే సమష్టి నిర్ణయాలతో ముందుకెళ్తేనే మేలు జరుగుతుంది. వారం ప్రారంభంలో చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సంతానం పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. సంపాదన పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి ఉద్యోగ రంగాల వారికి ఆశించిన శుభ ఫలితాలు ఉంటాయి. పదోన్నతి పొందే అవకాశం ఉంది. టీమ్ లీడర్​గా నూతన బాధ్యతలను చేపడతారు. ఆదాయం పదింతలు పెరుగుతుంది. వ్యాపారులు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. వృత్తిలో ఎదురయ్యే సవాళ్ళను తెలివిగా అధిగమిస్తారు. సంతృప్తికరమైన లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు అనుకూలం. పితృవర్గం నుంచి శుభవార్తలు అందుకుంటారు. గురు శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల వారికి తీవ్రమైన శ్రమ, పని ఒత్తిడి ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితులు దిగజారవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలహాలు, అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు పనిలో అనుకూలత ఉన్నప్పటికినీ అసూయపరుల వలన ప్రమోషన్ అవకాశాలు పోగొట్టుకుంటారు. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కానీ ప్రభుత్వ పరంగా సమస్యలు ఉండవచ్చు. మానసిక ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేస్తే మంచిది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే నష్టాలు ఉండవచ్చు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. శని శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల వారు పని పట్ల ఏకాగ్రత లోపించడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఆలోచనలు పక్కదారి పట్టడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి పట్ల అంకితభావం, శ్రద్ధ అవసరం. వ్యాపారులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. సంస్థను త్వరగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తారు. విద్యార్థులు తమ చదువులపై దృష్టి సారించి మంచి విజయాలు పొందుతారు. ఆరోగ్యం సహకరించదు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. సమయానుకూలంగా నడుచుకుంటే ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించవచ్చు. ఉద్యోగులు పని తీరు పట్ల ఉన్నతాధికారులు సంతృప్తితో ఉంటారు. మీకు నూతన బాధ్యతలను కూడా అప్పగిస్తారు. వ్యాపార రంగాల వారికి పెట్టుబడులు, లాభాల రూపంలో ధన ప్రవాహం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రుల రాకతో సందడిగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగం దొరుకుతుంది. హనుమాన్ చాలీసా పారాయణతో శుభ ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.