ETV Bharat / entertainment

సల్మాన్ సినిమాతో పాపులరైన హీరోయిన్​ - ఇప్పుడు మూవీస్​కు నో అంటోంది! - Actress Got Popular By Salman Movie - ACTRESS GOT POPULAR BY SALMAN MOVIE

Actress Got Popular With Salman Movie : సినిమాలపై ఇంట్రెస్ట్​తో పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఆ చిన్నారి. 14 ఏళ్లకే స్టార్ హీరో సరసన యాడ్​లో నటించి ఆడియెన్స్​ను ఆకట్టుకుంది. ఆ పై మ్యూజిక్ ఆల్బమ్స్​లో మెరిసింది. క్రమక్రమంగా బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే పలువురు ప్రశంసు అందుకుని అగ్రతారల సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఇక తనకు తిరుగులేదు అని అనుకున్న సమయంలో ఆ నటి సినిమాలకు దూరమైంది. ఇంతకీ తను ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Actress Got Popular With Salman Movie
Actress Got Popular With Salman Movie (Getty Images, ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 6:49 PM IST

Actress Got Popular With Salman Movie : టాలీవుడ్ ప్రేక్షకులకు ఈమే పేరు టక్కున గుర్తుకురాదు కానీ 'సూపర్' హీరోయిన్ అనగానే ఆమె రూపం వెంటనే గుర్తుకొస్తుంది. తనే ఆయేషా టకియా. 14 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలని కలలు కన్న ఈ చిన్నది, షాహిద్ కపూర్​తో ఓ యాడ్ లో కనిపించింది. తొలి యాడ్​తోనే ఆడియెన్స్​ను ఆకర్షించిన ఆయేషా, ఆ తర్వాత బాలీవుడ్ సింగర్ ఫాల్గుణి పాతక్ ఆల్బమ్​లోని 'మేరీ చునర్ ఉడ్ ఉడ్ జాయే' అనే పాటలో మెరిసింది. దీంతో ఆమెపై సినీ నిర్మాతల దృష్టి పడింది. ఈ నేపథ్యంలో క్రమంగా సినిమాల్లోకి అడుగుపెట్టింది.

2004లో 'టార్జాన్: వండర్ కార్' అనే సినిమా ద్వారా బాలీవుడ్​కు పరిచయమైంది. ఆ తర్వాతి ఏడాదే 'సూపర్'తో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'క్యాష్', 'సలాం ఏ ఇష్క్', 'వాంటెడ్' (పోకిరి హిందీ రీమేక్) లాంటి చిత్రాల్లో నటించింది.

చివరిగా మోద్ అనే బాలీవుడ్ మూవీలో కనిపించింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది. 'సుర్ క్షేత్రా' అనే సింగింగ్ రియాల్టీ షోలో కనిపించినా అంతగా పేరు తీసుకురాలేదు. ఆపైన మళ్లీ స్క్రీన్ మీద ఆయేషా కనిపించలేదు. తన 23 ఏట ఫర్హాన్ అజ్మీ అనే వ్యక్తితో ఆయేషా వివాహం జరిగింది. 2009లో వీరి పెళ్లి వేడుక జరిగింది. ప్రస్తుతం ఈ జంటకు ఓ బాబు కూడా ఉన్నాడు.

పెళ్లైయ్యాక సినిమాలకు దూరమైన ఈ చిన్నది తాజాగా ముంబయి ఎయిర్​పోర్ట్​లో మీడియా కంట పడింది. ఆ వెంటనే సోషల్ మీడియాలో ఆమె సరికొత్త లుక్ మీద రకరకాల పోస్టులు కనిపించాయి. ఆయేషాను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే వీటన్నిటికి ఆయేషా స్పందిస్తూ తను మళ్లీ సినిమాల్లోకి వచ్చే అవకాశం లేదని, తనకు పేరు కూడా వద్దని, తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నాని ఇక తనను వదిలేయమని కోరింది.

13ఏళ్లకే తొలి సినిమా- రూ.1 రెమ్యూనరేషన్​- ఆ సూపర్ స్టార్ లైఫ్ చివరకు! - Actress Started Career With Rs 1

రజినీకాంత్ సినిమాలో నటించినందుకు బాధపడ్డా! : హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.