ETV Bharat / spiritual

ఈ రాశివారికి నేడు అన్ని రంగాల్లో విజయమే- వ్యాపారంలో ఫుల్ ప్రాఫిట్! - Daily Horoscope

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 4:15 AM IST

Horoscope Today June 30th 2024 : జూన్​ 30న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (Getty Images)

Horoscope Today June 30th 2024 : జూన్​ 30న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి. అదృష్టం వరించి విజయం తలుపు తడుతుంది. ఉద్యోగులకు ఊహించని విధంగా ధనలాభాలు, పదోన్నతులు ఉంటాయి. ఈ రోజంతా ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తూ వేడుకల్లో మునిగితేలుతారు. మీ ఆలోచనలన్నీ ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు ఆశాజనకంగా ఉంది. గొప్ప ఆర్ధిక లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి ఉండవచ్చు. ఆర్ధిక ఫలితాలు మాత్రం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. మీ కుటుంబం గురించి లేదా మీ పిల్లల గురించి ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితుని కలుసుకుంటారు. మధురస్మృతులు నెమరు వేసుకుంటారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. చట్టపరమైన, కోర్టుకి సంబంధించిన లావాదేవీల పట్ల జాగ్రత్త వహించండి. శివారాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తుల పనితీరు పట్ల ఉన్నతాధికారులు పూర్తి సంతృప్తి చెందుతారు. వృత్తి వ్యాపార రంగాల వారికి వ్యాపారంలో పురోగతి ఉంటుంది. నూతన ఫ్రాంచైజీలు మొదలు పెడతారు. ఆర్ధికంగా ఎదుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది మంచి సమయం, మీ లాభాలు పెరగడమే కాకుండా, పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశం ఉంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పరోపకారానికి పోయి చిక్కుల్లో పడే ప్రమాదముంది. వ్యాపార రంగాల వారు వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో విజయం సాధించలేరు. ఉద్యోగులు ఆశించిన ఫలితాలు రావాలంటే మరింత కష్టపడాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శని శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ అవసరం. శత్రువులు దెబ్బ తీయడానికి సమయం కోసం ఎదురు చూస్తూ పొంచి ఉన్నారు. వారికి అవకాశం ఇవ్వొద్దు. ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలించి జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆపదలు తొలగుతాయి. కోపాన్ని నియంత్రించుకోండి. మాట్లాడేటప్పుడు శ్రద్ధ వహించండం మంచిది. ఉద్యోగులకు సహోద్యోగులతో వాద ప్రతివాదాలు ఉండవచ్చు. కుటుంబ వివాదాలకు అవకాశం ఉంది. అందుకే ప్రశాంతంగా ఉంటే మంచిది. శ్రీ నరసింహస్వామి ఆరాధనతో ప్రశాంతంగా ఉంటుంది. శత్రుజయం కలుగుతుంది.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఎటు చూసినా విజయాలే కనిపిస్తున్నాయి. అయితే ఈ విజయాలు ముందు నిర్ణయించినవే. మీ కష్టానికి ప్రతిఫలమే ఈ విజయాలు. మీ విజయరహస్యాలను ఇతరులతో పంచుకోండి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. వ్యాపారులు తిరుగులేని విజయాలను సాధించి మంచి లాభాలను గడిస్తారు. కళాకారులకు సామాజిక పరిచయాలు ఊహించని రీతిలో పెరుగుతాయి. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీడియా, పత్రిక రంగం వారికి ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీ నైపుణ్యాన్ని చూసి అంతా ప్రశంసిస్తారు. కొంత శ్రమతో గొప్ప శుభ ఫలితాలను సాధిస్తారు. వ్యాపారులకు ఆదాయం మెరుగు పడుతుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. శివారాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారులకు ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపార సంబంధిత పనులపై అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు తీవ్రమవుతాయి. అయితే తిరుగులేని నాయకత్వంతో, గొప్ప ప్రతిభతో మీతో పాటు మీ ఉద్యోగులను కూడా కష్టం నుంచి గట్టెక్కిస్తారు. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉండవచ్చు. దైవబలంతో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు పనిలో తమదైన ముద్ర వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులు పోటీదారులని అధిగమించి విజేతగా నిలుస్తారు. మీ పై అధికారుల నుంచి ప్రసంశలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి శ్రమకు తగిన ఫలం ఉంటుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రజాసంబంధాలు అద్భుతంగా మెరుగు పడతాయి. ప్రత్యర్థుల వైఖరి ఓ కంట కనిపెడుతూ ఉండటం అవసరం. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధనతో శత్రుజయం ఉంటుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు మీ పక్కనే ఉంటారు. వ్యూహాత్మకంగా వ్యహరించాలి. ఎక్కడా నిగ్రహం కోల్పోవద్దు. లేకపోతే ఇంట్లోనూ, ఆఫీస్​లోనూ సమస్యలు ఏర్పడతాయి. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి చెప్పుకోతగ్గ పురోగతి ఉండదు. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే మోసపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యల కారణంగా చికాకుతో ఉంటారు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.