నాగార్జున సాగర్ వెళ్లేవారికి గుడ్‌న్యూస్ - తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులు - టైమింగ్స్ ఇవే!
Published : Aug 7, 2024, 5:03 PM IST
TGSRTC Special Buses to Nagarjuna Sagar:శ్రీశైలం నుంచి పోటెత్తుతున్న వరద కారణంగా నాగార్జున సాగర్ గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. ఒక్కసారే 20 గేట్లను ఎత్తడంతో ఈ సుందర దృశ్యాలను చూడాలని చాలా మంది సాగర్‌కు పయనమయ్యారు. మరి మీరు కూడా వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకోసం తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ ఎంజీఎంఎస్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్‌గా సాగర్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు.. రీజియన్ మేనేజర్ శ్రీలత ఒక ప్రకటన విడుదల చేశారు. నల్లగొండ డిపో ఆధ్వర్యంలో ఈ సర్వీసులు నడుస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి మొదలై.. 6.45, 7.15, 7.30., 8.00, 9.45, 10.45 గంటలు, మధ్యాహ్నం 2.30 గంటలకు, సాయంత్రం 5.40 గంటలకు సాగర్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆమె తెలిపారు.