national

ట్రేడింగ్ పెట్టుబడుల పేరిట రూ.5.27 కోట్ల మోసం - నలుగురు నిందితుల అరెస్ట్

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 1:08 PM IST

Published : Sep 28, 2024, 1:08 PM IST

CYBER POLICE ARREST THE ACCUSED
CYBER SECURITY ACCUSED (ETV Bharat)

Trading Investment Frauds :ట్రేడింగ్ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన నిందితులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. రామన్ మురళీ కృష్ణన్, కందుకూరి రవీందర్ రెడ్డి, బండ్లమూడి రవి, సామినేని మాధవరావు అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల నుంచి ట్రేడింగ్ పెట్టుబడుల పేరు చెప్పి రూ.5 కోట్ల 27 లక్షలు కాజేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.

తాత్కాలిక కమీషన్ల కోసం ఇతరులకు తమ బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద లావాదేవీల కోసం బ్యాంక్ ఖాతాలను ఉపయోగించడం కోసం సంప్రదించినట్లయితే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డ్‌లు విక్రయించడంలో పాలు పంచుకున్న వారిపైనా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిందితుల నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, చెక్ బుక్స్, సిమ్ కార్డ్‌లు, ఏటీఎం కార్డ్‌లు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details