ETV Bharat / state

ప్రకృతి ఒడి పిలుస్తోంది - అందాల కనువిందుకు ఆహ్వానిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా - Adilabad Tourist Places - ADILABAD TOURIST PLACES

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు - సెలవుల్లో ఈ ప్రాంతాలలో పర్యటిస్తే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు

OLD ADILABAD TOURISM SPOTS
Adilabad Tourist Places (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2024, 5:36 PM IST

Adilabad Tourist Places : పాఠశాలలో పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు దసరా పండుగ సెలవులొచ్చాయి. సెలవులంటే చాలు అందరికీ ఆనందమే. కొత్త ప్రదేశాల్లో సంతోషంగా గడుపుతూనే మరోవైపు మనకు దగ్గరలోని చారిత్రక ప్రాంతాలు, ఆలయాలను పర్యటిస్తే అనుభవాలు, జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించండి.

ఆదిలాబాద్‌ జిల్లాలో 1200 ఏళ్లనాటి సూర్యదేవాలయం : ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని 122 సంవత్సరాల కింద జైనులు నిర్మించారు. ప్రతి సంవత్సరం రెండు సార్లు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకటం దీని ప్రత్యేకత. ఈ ఆలయం ఆదిలాబాద్‌ నుంచి 30 కి.మీ. దూరంలో ఉంటుంది.

Adilabad Tourist Places
సూర్యదేవాలయం (ETV Bharat)

కుంటాల జలపాతం : ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతాన్ని చూడడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు నిత్యం వస్తుంటారు. ఈ జలపాతం చుట్టూ దట్టమైన అడవిలో ఉన్నందున అటవీమార్గం గుండా జలపాతానికి చేరుకోవడం ఓ ప్రత్యేక అనుభూతి వస్తుంది.

Adilabad Tourist Places
కుంటాల జలపాతం (ETV Bharat)

పర్యాటకుల స్వర్గధామం పొచ్చెర : ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని పొచ్చెర సమీపంలోని ఈ జలపాతం సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఎత్తైన ప్రదేశం నుంచి నీరు కిందికి జాలువారుతాయి. దీన్ని వీక్షించడం గొప్ప దృశ్యంగా చెప్పుకోవచ్చు. బోథ్‌ జాతీయ రహదారి ఎక్స్‌ రోడ్‌ నుంచి 6 కి.మీ. దూరంలో ఉంది.

Adilabad Tourist Places
పొచ్చెర జలపాతం (ETV Bharat)

ఆసిఫాబాద్‌లో కుమురంభీం స్మారక మ్యూజియం : ఆసిఫాబాద్‌ జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్‌ వద్ద నిర్మించిన కుమురంభీం స్మారక మ్యూజియం ఎంతో ప్రముఖమైంది. జల్, జంగల్, జమీన్‌ నినాదంతో నిజాం రాజులతో పోరాడి తన ప్రాణాన్నే త్యాగం చేసిన కుమురంభీం పోరాట విశేషాలను తెలిపే మ్యూజియం ఇది. దీనికి దగ్గరలో ఉన్న కెరమెరి ఘాట్‌ రహదారిని చూడవచ్చు.

Adilabad Tourist Places
కుమురం భీం మ్యూజియం (ETV Bharat)

నిర్మల్‌ జిల్లా ఖ్యాతిని తెలిపే కొయ్యబొమ్మలు : అత్యంత పేరుపొందిన నిర్మల్‌ జిల్లా కేంద్రంలో తయారయ్యే కొయ్యబొమ్మలు వీక్షించాల్సిందే. తేలికపాటి పొనికి కర్రతో 400 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్న ఈ బొమ్మలు సజీవంగా చూడ ముచ్చటగా కనిపిస్తాయి. అనంతరం ఇక్కడి నుంచి 15 కి.మీ. దూరంలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌ జలాశయాన్ని చూడవచ్చు.

Adilabad Tourist Places
నిర్మల్ కొయ్యబొమ్మలు (ETV Bharat)

కడెం అందాల కనువిందు : నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో వాగుపై నిర్మించిన జలాశయం ఇది. దీని ద్వారా కడెం, దస్తూరాబాద్‌తో పాటు మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట, హాజీపూర్‌, జన్నారం, దండేపల్లి మండలాలకు సాగు నీరందిస్తున్న తీరును తెలుసుకోవచ్చు. బోటు ద్వారా జలాశయాన్ని చూడవచ్చు.

Adilabad Tourist Places
కడెం జలాశయం (ETV Bharat)

బాసర సరస్వతి క్షేత్రం : చదువుల తల్లి సరస్వతి అమ్మవారు ముథోల్‌ మండలంలోని బాసరలో కొలువై ఉన్నారు. గోదావరి నదీ తీరంలో ఉన్న దేవాలయానికి అక్షరాభాస్యం చేయించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.

Adilabad Tourist Places
బాసర ఆలయం (ETV Bharat)

మంచిర్యాల జిల్లా సిరులవేణి, సింగరేణి : మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి 10 కి.మీ. నుంచి 30కిలో మీటర్ల దూరంలోనే శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, ఇందారం, బొగ్గు గనులున్నాయి. ఇందులో ఉపరితల గనులతోపాటు భూగర్భ గనులున్నాయి. బొగ్గు తవ్వడం నుంచి రవాణా చేసే వరకు వివిధ దశలు, కార్మికుల శ్రమను తెలుసుకోవచ్చు.

Adilabad Tourist Places
సింగరేణి గనులు (ETV Bharat)

ఎల్లంపల్లి జలాశయం : ఈ జలశాయాన్ని గోదావరి నదిపై హాజీపూర్‌ మండలం ఎల్లంపల్లి సమీపంలో నిర్మించారు. ఇది మంచిర్యాల, లక్షెట్టిపేట మధ్యలో ఉంటుంది. సాగు నీటితో పాటు హైదరాబాద్‌ వరకు తాగు నీరందించే ప్రక్రియను చూడవచ్చు.

Adilabad Tourist Places
ఎల్లంపల్లి జలాశయం (ETV Bharat)

సత్యదేవుని నిలయం, గూడెం : దండేపల్లి మండలం గూడెం సమీపంలో గోదావరి తీరంలో ఏకైక సత్యదేవుని ఆలయం ఉంది. జాతీయ రహదారిని ఆనుకుని నిర్మించిన ఈదేవాలయం పక్కనే సాయిబాబా, అయ్యప్ప ఆలయాలు ఉన్నాయి. ఎల్లంపల్లి నుంచి నీరందించే గూడెం ఎత్తిపోతల పథకం ఉంది.

Adilabad Tourist Places
సత్యదేవుని ఆలయం (ETV Bharat)

ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో చర్చిగా ప్రసిద్ది చెందిన సీఎస్‌ఐ చర్చి లక్షెట్టిపేటలోని ఉంది. మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలోని జింకల సంరక్షణ కేంద్రం, మ్యూజియంను సందర్శించవచ్చు. జన్నారం నుంచి ఆదిలాబాద్‌ జిల్లా వరకు విస్తరించి ఉన్న కవ్వాల్‌ అభయారణ్యాన్ని చూడవచ్చు. ఇక్కడ నుంచి సఫారీ వాహనంలో లోపల ఉన్న అడవిని చుట్టవచ్చు.

పిల్లలకు సెలవులొస్తున్నాయిగా - అలా మన 'తెలంగాణ నయాగరా'లు చూపించుకు రండి - waterfalls in Telangana

IRCTC "హ్యాపీ హిమాచల్​ అండ్​ పాపులర్​ పంజాబ్​" - అందుబాటు ధరలోనే 8 రోజుల టూర్​! - Happy Himachal and Popular Punjab

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.