టీచర్ డిప్యుటేషన్ రద్దు చేయాలంటూ రహదారిపై విద్యార్థుల ధర్నా
Published : Aug 24, 2024, 2:23 PM IST
Students Protest on Teacher Deputation :టీచర్‌ను డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు పంపించొద్దంటూ ఓ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా అక్బర్ పేట- భూంపల్లి మండలం చిట్టాపూర్‌లో జరిగింది. చిట్టాపూర్ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించడానికి భాగ్యలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు కృషి చేస్తుందని, ఆమె డిప్యూటేషన్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదించి డిప్యూటేషన్ రద్దయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ధర్నా విరమించారు.