Published : 5 hours ago
రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం - తెలంగాణ సీఎంఆర్ఎఫ్కు రూ.20 కోట్లు అందజేత
Reliance Foundation Donates RS 20 Crores to CMRF : సీఎంఆర్ఎఫ్కు భారీ విరాళాన్ని రిలయన్స్ ఫౌండేషన్ అందజేసింది. సీఎంఆర్ఎఫ్కు రూ.20 కోట్ల విరాళాన్ని అందించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి రిలయన్స్ సంస్థ ప్రతినిధులు చెక్కును అందజేశారు. అలాగే సీఎంఆర్ఎప్కు భారీగానే విరాళాలు వెళుతున్నాయి. ప్రముఖులు, రాజకీయవేత్తలు, సామాన్యులు సైతం విరాళాలు అందిస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలకు తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది.