national

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

ETV Bharat / snippets

మైనర్​ బాలికపై 65 ఏళ్ల వృద్ధుడి లైంగికదాడి - పోక్సోకేసు నమోదు

65 years old man Sexual Assault Minor Girl
65 years old man Sexual Assault Minor Girl (ETV Bharat)

65 years old man Sexual Assault Minor Girl : అభంశుభం తెలియని 12 ఏళ్ల బాలికను ఓ వృద్ధుడు గర్భవతిని చేసిన ఉదంతం వరంగల్​ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్​ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సాంబయ్య(65) అనే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బాలిక ఆరోగ్య పరిస్థితిని గమనించిన తల్లి నిలదీయగా విషయం తెలిపింది. దీనిపై స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. ఆ విద్యార్థిని 4 నెలల గర్భిణిగా నిర్ధారించారు. దీంతో సాంబయ్యను అదుపులోకి తీసుకుని అతడిపై పోక్సో కేసును నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details