Phone Tapping Case Accuses Bail Dismiss : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్రావులకు కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది. కేసులో అరెస్ట్ అయి 90 రోజుల్లా ఛార్జిషీట్ వేయకపోతే మ్యాండేటరీ/డిఫాల్ట్ బెయిల్ ఇవ్వచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. అయితే తాము ఛార్జిషీట్ 90 రోజుల లోపే వేశామని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు చుక్కెదురు - బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
Phone Tapping Case Accuses Bail Dismiss (ETV Bharat)
Published : Jun 27, 2024, 9:01 PM IST
వివరాలు సరిగా లేవని తిప్పి పంపడంతో తిరిగి మళ్లీ వేసినట్లు పోలీసుల తరఫు న్యాయవాదులు కోర్టులో తెలిపారు. ఛార్జిషీట్ తిప్పి పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనున్నట్లు కాదన్నారు. దీనిపై బుధవారం వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. పోలీసుల వాదనలో ఏకీభవించిన కోర్టు వారి బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ప్రణీత్‌రావు మ్యాండేటరీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడం ఇది రెండోసారి.