national

ETV Bharat / snippets

ఈ నెల 30న ధర్నాచౌక్ వద్ద బీజేపీ రైతు రుణమాఫీ సాధన దీక్ష

TELANGANA BJP FIRE ON CONGRESS
BJLP LEADER MAHESHWAR REDDY (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 5:22 PM IST

BJLP LEADER MAHESHWAR REDDY: బీజేపీ ఈ నెల 30న ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద రైతు రుణమాఫీ అమలు సాధన దీక్ష చేపట్టనుంది. ఇందిరా పార్క్ వద్ద చేయనున్న 24 గంటల దీక్షా స్థలిని బీజేపీ శాసన సభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎన్. వి. సుభాష్, పార్టీ కార్యకర్తలు పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్​లో ప్రకటించిన రైతు డిక్లరేషన్​ను తుంగలో తొక్కిందని ఏలేటి మహేశ్వర్ ​రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి, మంత్రులు పొంతన లేని ప్రకటన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందంటే, మంత్రులు మరికొంత మందికి చేస్తామని చెప్తున్నారన్నారు. రైతు భరోసా ఊసే లేదు, వడ్లకు బోనస్ ఇస్తామని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు. బీజేపీ చేసే పోరాటానికి రైతులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలపాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details