MLC Gorati Venkanna On SC Reservations : మాల - మాదిగల మధ్య కొంత వ్యత్యాసాలున్నాయని, మాలల జనాభా దామాషా ప్రకారం తమ వాటా తమకు కావాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న స్పష్టం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ నిష్పక్షపాతంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. మాదిగలకు వ్యతిరేకంగా కాదు, మాలల రిజర్వేషన్ హక్కుల కోసం ఉద్యమించాలని గోరటి వెంకన్న మాలలకు పిలుపునిచ్చారు. శాసనమండలిలో ఎస్సీ వర్గీకరణపై జరిగిన చర్చపై గోరటి వెంకన్న మాట్లాడారు.
'ఎస్సీ రిజర్వేషన్ నిష్పక్షపాతంగా చేయాలి - మాలల హక్కుల కోసం ఉద్యమిస్తాం'
MLC Gorati Venkanna On SC Reservations (ETV Bharat)
Published : Aug 2, 2024, 3:35 PM IST
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎక్కువగా మాలలు వెనుకపడ్డారన్నారు. వర్గీకరణ ఉద్యమానికి గద్దర్, తాను మద్దతు పలికామన్నారు. వర్గీకరణ ఉద్యమాన్ని ఎంతో మంది రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం వాడుకున్నారని ఆరోపించారు. వర్గీకరణ అమలుపై ప్రభుత్వానికి ఎందుకంత ఉత్సాహం అని మండిపడ్డారు. మాలలపై దాడులు జరిగినప్పుడు సర్కార్ ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేసి రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.