national

ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్యపై సమగ్ర విచారణ - అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 3:33 PM IST

FARMER SUICIDE ISSUE IN KHAMMAM
Minister Tummala on Farmer Suicide (ETV Bharat)

Minister Tummala on Farmer Suicide : ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బొజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య ఉదంతంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. గ్రామంలో తన పొలం కొందరు నాశనం చేశారంటూ వారిపై పోలీసు స్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని తీవ్ర మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసి ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవిన్యూ, పోలీస్ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర విచారణ జరిపి తక్షణమే ఆ నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని పేర్కొన్నారు. రైతులు పొలం పంచాయితీల కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో పొలం పంచాయితీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details