చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా చర్యలు చేపడుతున్నాం : మంత్రి తుమ్మల
Published : Jun 8, 2024, 9:58 PM IST
Minister Tummala about Handloom Workers: చేనేత కార్మికులకు దీర్ఘకాలిక లబ్ది చేకూర్చే పథకాల కోసం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 365 రోజులు పొడవునా చేతినిండా పని కల్పించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పని చేస్తున్న ప్రాధమిక చేనేత సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. 10 శాతం యార్న్ రాయితీ పథకాన్ని కేబినెట్ ఆమోదం లేకుండా ప్రవేశ పెట్టడం వల్ల నిధులు విడుదల కాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.