Minister Sridhar Babu On Telangana Budget Bill : ఈ నెల 25న తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. నేడు కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని ఆ కేటాయింపులను పరిశీలించి బడ్జెట్ నిర్ణయించుకుంటామని ఆయన తెలిపారు. మాజీమంత్రి హరీశ్‌రావుకి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలిసి కూడా తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఇచ్చిన అంశాలపై స్పీకర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
జులై 31 ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాలి - లేకుంటే జీతాలు ఇవ్వలేం : శ్రీధర్ బాబు
Minister Sridhar Babu On Telangana Budget (ETV Bharat)
Published : Jul 23, 2024, 5:20 PM IST
జులై 31 తేదీలోగా బడ్జెట్‌కు సంబంధించి అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాలని లేదంటే జీతాలు కూడా రాని పరిస్థితి అని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం స్పీకర్‌ని కోరిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఆచరణతో ముందుకు పోతున్నామన్నారు.