national

పల్నాడులో నీటి కలుషితంపై వారం రోజుల్లో స్పష్టత- మంత్రి నారాయణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 9:45 PM IST

narayana_review_on_diarrhea
narayana_review_on_diarrhea (ETV Bharat)

Minister Narayana Reviewed with Officials on Diarrhea:పల్నాడు జిల్లాలో డయేరియా విజృంభించడంతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులతో క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్షించారు. పిడుగురాళ్లలో ఇప్పటి వరకు 60 డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. కృష్ణా నది నుంచి మంచినీరు అందించేందుకు 16 కి.మీ పైప్ లైన్ ఉందని దీంతో పాటు పట్టణంలో నీరు అందిస్తున్నట్లు తెలిపారు. పైప్​లైన్​లోని ఒక పవర్ బోర్​లో నైట్రేట్ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారని తెలిపారు. వాటర్ లీకేజీని గుర్తించి 5 రోజులు పాటు నీటి సరఫరా నిలిపివేసామని తెలిపారు. ఆ నీటిని పరీక్ష కోసం విజయవాడ ల్యాబ్​కు శాంపిల్స్ పంపిస్తున్నట్లు వివరించారు. పట్టణంలో ఉన్న ఆర్వో ప్లాంట్స్​లోని నీటిని కూడా పరిక్షించాల్సి ఉందని వారం రోజుల్లో నీరు ఎక్కడ కలుషితం ఆయిందనేది క్లారిటీ వస్తుందని నారాయణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details