Budameru Leakage Works Complete: వినాయకచవితి రోజున విజయవాడ ముంపునకు కారణమైన విజ్ఞం తొలిగిపోయింది. బుడమేరుకు పండిన గండ్లను అధికారులు పూడ్చివేశారు. శుక్రవారానికే రెండు గండ్లు పూడ్చివేసిన అధికారులు మూడో గండిని ఇవాళ బండరాళ్లతో నింపివేశారు. విజయవాడ ముంపునకు కారణమైన వరదకు అడ్డుకట్టవేశారు. మూడో గండి పూడ్చివేత పనులు శుక్రవారం నుంచి నిరంతరంగా సాగాయి. 90 మీటర్ల మేర పడిన మూడో గండిన అధికారులు పూర్తి చేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం నిలిచింది. అంతకుముందు మంత్రి లోకేశ్ గండ్లు పూడ్చివేత పనులను పరిశీలించారు. గండి పడిన ప్రాంతంలో దిగువకు వెళ్తున్న ప్రస్తుత ప్రవాహ పరిస్థితిని లోకేశ్‌కు మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు.
పూర్తైన బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు - నిలిచిన వరద ప్రవాహాం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2024, 1:11 PM IST