ETV Bharat / snippets

రియల్ ఎస్టేట్ వ్యాపారిని మింగేసిన బుడమేరు వరద - రెండు రోజుల తర్వాత దొరికిన మృతదేహం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 10:22 PM IST

Software Employee From Machilipatnam was Trapped in Budameru Flood
Software Employee From Machilipatnam was Trapped in Budameru Flood (ETV Bharat)

Real Estate Dealer From Machilipatnam was Trapped in Budameru Flood : వినాయక చవితి పండుగను కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుని వెళ్లిపోవాలనుకున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బుడమేరు వరద మింగేసింది. వరదలో చిక్కుకుని రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూశారు. పోలీసులు ఈరోజు(సోమవారం) మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, మచిలీపట్నంకు చెందిన కలిదిండి ఫణికుమార్(43) హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వినాయక చవితి నిమిత్తం స్వగ్రామానికి చేరుకున్న ఫణికృష్ణ శనివారం గన్నవరంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో విజయవాడ మీదుగా వెళ్లాలని స్థానికులు చెప్పినా ఫణికుమార్ వినిపించుకోలేదు. కేసరపల్లి-ఉప్పులూరు, కంకిపాడు మీదుగా వెళ్తానంటూ తన కారులో దూసుకొచ్చాడు. ఒక్కసారిగా బుడమేరు ఉద్దృతిలో చిక్కుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి చనిపోయిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.