Minister Nara Lokesh Counter to YS Jagan: గవర్నమెంటు స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుతో ఈ ప్రభుత్వం పేదల వ్యతిరేకి అని నిరూపించుకుందంటూ వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌కి మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కౌంటర్ ట్వీట్ చేశారు. విద్యా శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
NARA LOKESH TWEET: ఏం చదివారో, ఎక్కడ చదివారో అస్సలు తెలియని జగన్ విద్య శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం తీసుకున్న నిర్ణయం వల్ల 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన పదో తరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆక్షేపించారు.
ఏం చదివావో తెలియదు..ఎక్కడ చదివావో అస్సలు తెలియదు..నువ్వు విద్య శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేకు జగన్! కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం
— Lokesh Nara (@naralokesh) September 16, 2024
మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సిబిఎస్ఈ విధానంలో… https://t.co/bMd4dvM9ou
పరీక్షా విధానంలో మార్పులు తీసుకొస్తాం: ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్య సంవత్సరం 6వ తరగతి నుంచే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సీబీఎస్ఈలో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన కంసమామ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పాఠశాలల రూపురేఖలు మార్చాను అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. జగన్ అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గినట్టో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ అనాలోచిత నిర్ణయం - సీబీఎస్‌ఈ విద్యార్థుల సామర్థ్యాలు ఢమాల్ - CBSE Students Problems in AP
YS JAGAN MOHAN REDDY TWEET: కాగా అంతకు ముందు సీబీఎస్ఈ విధానంపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారని అన్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారన్న జగన్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ, గవర్నమెంటు స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకని ప్రశ్నించారు.
వాళ్లు ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోవాలా, వారి జీవితాలకు శాపంపెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటని నిలదీశారు. గవర్నమెంటు స్కూలు పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేంట్లోనూ తక్కువకాదని, వీళ్లంతా తెలివైన వారని జగన్ అన్నారు. పైగా ప్రభుత్వ టీచర్లు లక్షలమంది పోటీపడే పరీక్షల్లో ఉత్తీర్ణులై, చక్కటి శిక్షణకూడా పొందినవారని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఉన్నవారికంటే గొప్పచదువులు చదివినవారు, గొప్పగా చదువులు చెప్పగలిగినవారన్నారు. అలాంటివారిని తక్కువగా చూసే మనస్తత్వాన్ని మార్చుకోవాలంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దీంతో జగన్‌కు కౌంటర్ ఇస్తూ మంత్రి లోకేశ్ కౌంటర్ ట్వీట్ చేశారు.
ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలి: లోకేశ్ - Nara Lokesh on SALT Project