ETV Bharat / state

ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్​ గణనాథుడు - 70 ఏళ్ల చరిత్ర ఏంటో తెలుసా? - khairatabad ganesh 70 Years history - KHAIRATABAD GANESH 70 YEARS HISTORY

Khairatabad Ganesh 70 Years History: శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా ఏ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడు భక్తుల నీరాజనాలందుకున్నాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై ప్రపంచ రికార్డు సృష్టించాడు. మరి ఈ గణపయ్య ప్రయాణం ఖైరతాబాద్​లో ఎలా ప్రారంభమైంతో తెలుసా? స్వాతంత్య్ర ఉద్యమకారుడు తిలక్‌ ప్రేరణతో సింగరి శంకరయ్య అనే వ్యక్తి 1954లో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, నాటి నుంచి నేటి వరకు ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం కొనసాగుతోంది.

70 years old khairatabad ganesh history in telugu
70 years old khairatabad ganesh history in telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 10:10 PM IST

Khairatabad Ganesh 70 Years History : గణపతి బప్పా మోరియా అంటూ ప్రతి ఏడాది పది రోజుల పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోతాయి. లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్​కి బారులు తీరుతారు. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఖైరతాబాద్ గణనాథుడికి దశాబ్దాల చరిత్ర ఉంది.

ఒక్క అడుగుతో ప్రారంభం : 1954వ సంవత్సరం నుంచి ఖైరతాబాద్​లో గణేశ్‌ నవరాత్రులను నిర్వహిస్తున్నారు. ఉద్యమకారుడు బాల గంగాధర్ తిలక్ ప్రేరణతో హైదరాబాద్​కి చెందిన సింగరి శంకరయ్య, 1954లో మొట్టమొదటి సారిగా ఖైరతాబాద్​లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. అలా ఒక్క అడుగు ఎత్తుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణనాథుడి ప్రయాణం, నాటి నుంచి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ వచ్చాడు.

70 ఏళ్లు పూర్తి : ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు మాత్రమే కాదు, ఆకారమూ అత్యంత ప్రత్యేకమైనదే. గడిచిన 70 ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తూ, భక్తులను ఆకట్టుకుంటున్నాడు. 2014వ సంవత్సరం నాటికి 60 అడుగుల ఎత్తుకు చేరిన గణపతి రూపాన్ని, ఏటా ఒక అడుగు తగ్గించాలని కమిటీ నిర్వాహకులు భావించారు. అలా 2018 వరకూ ఒక్కో అడుగు తగ్గిస్తూ 55 అడుగులకు తీసుకొచ్చారు. అయితే భక్తుల కోరిక తిరిగి 2019లో అత్యధికంగా 61 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అయితే 2020లో కొవిడ్ నేపథ్యంలో కేవలం 9 అడుగుల ఎత్తులో మాత్రమే గణపయ్యను ఏర్పాటు చేయగా, గత ఏడాది 63 అడుగుల ఎత్తులో భక్తులకు కనువిందు చేశాడు. ఇక ఈ ఏడాది 70 ఏళ్లను పురస్కరించుకుని ఏకంగా 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు కనువిందు చేశాడు.

ఖైరతాబాద్​ సప్తముఖ మహాశక్తి గణపతికి సీఎం రేవంత్​ తొలి పూజ - దర్శననానికి పోటెత్తిన భక్తులు - Khairatabad Ganesh first puja

అతి పెద్ద మట్టి విగ్రహం : ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో కొలువైన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అత్యంత ప్రత్యేకమైన రూపంగా చెప్పవచ్చు. మండపంపైన గణపయ్యకి ఓ వైపు రాహుకేతుల విగ్రహాలు, మరోవైపు అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉక్కు, మట్టితో చేసిన ఈ భారీ విగ్రహాన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంది. ఇక ప్రధాన గణపతి మండపానికి ఓ వైపు శ్రీనివాస కల్యాణం, మరోవైపు శివపార్వతుల కల్యాణ ఘట్టాలకు సంబంధించిన ప్రతిమలను ఏర్పాటు చేశారు. చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి భక్తులు వచ్చారని కమిటీ సభ్యులు తెలిపారు.

మంగళవారం ఉదయం సుమారు 7 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, సెన్సేషన్ థియేటర్ మీదుగా తెలుగు తల్లిఫ్లై ఓవర్ పక్క నుంచి ట్యాంక్ బండ్​పైకి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి చేరుకోనున్నాడు. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్న నేపథ్యంలో సుమారు 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1.30 లోపు నిమజ్జనం పూర్తి చేయనున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.

ఖైరతాబాద్‌ గణేశుడికి 280 జంటలతో రుద్రహోమం - భారీగా తరలివచ్చిన భక్తులు - KHAIRATABAD GANESH RUDRA HOMAM

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.