Space Walk Spacex Mission : అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్‌వాక్ నిర్వహించిన తొలివ్యక్తిగా చరిత్ర సృష్టించిన బిలియనీర్ జేర్డ్ ఐజక్‌మన్ భూమికి తిరిగి వచ్చారు. ఐదు రోజుల పర్యటనను ముగించుకున్న ఐజక్‌మన్ తన సిబ్బందితో కలిసి స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌లో. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం డ్రైటార్ట్‌గస్ బీచ్‌లో స్పేస్ క్యాప్సుల్ విజయవంతంగా సముద్రంలో దిగింది.
స్పేస్‌వాక్‌ను నిర్వహించిన సంస్థగా రికార్డ్
జేర్డ్ ఐజక్‌మన్‌తోపాటు స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఇద్దరు ఇంజనీర్లు అన్నా మెనోన్, సారా గిల్లీస్, మాజీ ఎయిర్‌ఫోర్స్ పైలెట్ స్కాట్ కిడ్‌పోటీట్ సురక్షితంగా సురక్షితంగా భూమిపై దిగారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ సంస్థ ఈ ప్రాజెక్టుతో అంతరిక్షరంగంలో చరిత్ర సృష్టించింది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్‌వాక్‌ను నిర్వహించిన సంస్థగా నిలిచింది.
ఒకరి తర్వాత ఒకరు వ్యోమనౌక నుంచి బయటకు వచ్చి మరీ!
పొలారిస్ డాన్ ప్రాజెక్టు కింద ఫాల్కన్-9 రాకెట్ ద్వారా మంగళవారం నలుగురు వ్యక్తులను స్పేస్ ఎక్స్ నింగిలోకి పంపింది. ఈప్రాజెక్టులో మొత్తం స్పేస్‌ఎక్స్ పరికరాలనే ఉపయోగించారు. వీరి అంతరిక్ష నౌక అత్యధికంగా 875 మైళ్ల ఎత్తుకు చేరుకుంది. 14 వందల కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. 740 కిలోమీటర్ల దూరంలో జేర్డ్ ఐజక్‌మన్, సారాగిల్లిలు ఒకరి తర్వాత ఒకరు వ్యోమనౌక నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్ చేశారు. 1965లో సోవియట్ యూనియన్ తొలిసారి స్కోర్ చేసిన తర్వాత స్పేస్‌వాక్ చేసిన 264వ వ్యక్తిగా ఐజక్‌మన్, 265వ వ్యక్తిగా స్పేస్‌ఎక్స్‌కు చెందిన సారా గిల్స్ నిలిచారు. ఇంతకుముందు వరకు స్పేస్‌వాక్ నిర్వహించిన వారంతా వృత్తిపరంగా వ్యోమగాములు.
దాదాపు 40 రకాల ప్రయోగాలు
ఈ క్రమంలో స్పేస్‌ఎక్స్ తయారు చేసిన స్పేస్‌సూట్‌ను పరీక్షించారు. అంతరిక్షంలో ఐదు రోజులపాటు గడిపిన ఈ బృందం దాదాపు 40 రకాల ప్రయోగాల్లో పాల్గొంది. మైక్రోగ్రావిటీలో మనిషి శరీరం స్పందించే తీరుతోపాటు కిడ్నీల పనితీరు, వాటిల్లో రాళ్లు ఏర్పడటం, స్పేస్‌లో సీపీఆర్ ప్రక్రియ వంటి అంశాలను పరిశోధకులు పరిశీలించారు. ఈ ప్రాజెక్టు కోసం బిలియనీర్ ఐజక్‌మన్ దాదాపు 200 మిలియన్ డాలర్ల సొంతంగా వెచ్చించారు.