Cyber Fraud By Credit Card :యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌కు చెందిన స్థానిక ఎస్బీఐ ఖాతాదారుడి క్రెడిట్ కార్డు నుంచి సైబర్ నేరగాళ్లు రూ.88 వేలు స్వాహా చేశారు. బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం 20 రోజులు క్రితం తన క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని, సరి చేసుకోవాలని పదేపదే ఫోన్లు వచ్చాయి. ఈ వియషంపై బాధితుడు బ్యాంక్‌కు వెళ్లగా క్రెడిట్ కార్డుకు సంబంధించిన ఉద్యోగి సెలవులో ఉండటంతో వెనుతిరిగారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో సైబర్ నేరగాళ్ల మోసం - క్రెడిట్ కార్డు నుంచి రూ.88 వేలు స్వాహా
Cyber Fraud By Credit Card (ETV Bharat)
Published : Aug 6, 2024, 8:05 PM IST
దీంతో చేసేదేమీ లేక ఫోన్లో ఓటీపీ చెప్పారు. ఇంతలో కొత్త క్రెడిట్ కార్డు రాగా బాధితుడు దీని గురించి బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీశారు. క్రెడిట్ కార్డు నుంచి జులై 15న రూ.40 వేలు, అదే రోజు మరో రూ.48 వేలు ముంబయిలోని ఓ బ్యాంక్ ఖాతాకు జమైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బాధితుడు ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.