KTR Responded to riots in Medak : కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. శనివారం రాత్రి మెదక్ పట్టణంలో చోటు చేసుకున్న పరిణమాలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ఎలాంటి మత కల్లోలాలు లేకుండా పూర్తి ప్రశాంతంగా ఉండేవని కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో ఎప్పుడూ మత కల్లోలాలు లేని ప్రశాంత పట్టణమైన మెదక్లో ఈ పరిస్థితి రావడం సిగ్గుచేటని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయి - కేటీఆర్
KTR Responded to riots in Medak (ETV Bharat)
Published : Jun 16, 2024, 3:07 PM IST
అసలేం జరిగిందంటే.. నిన్న మెదక్ పట్టణంలో ఓ వర్గం వారు గోవులను తరలిస్తున్నారనే సమాచారం అందటంతో, మరో వర్గం వారు పట్టణ శివారులోని బంగ్లా చెరువు సమీపంలో, నర్శిఖేడ్‌లో అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.