national

ETV Bharat / snippets

ఎమ్మెల్యే సంజయ్​ చేరిక పట్ల జీవన్​ రెడ్డి అసహనం! - జగిత్యాలలో ఆసక్తికర పరిణామాలు

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 12:21 PM IST

MLA Dr Sanjay Kumar
MLA Dr Sanjay Kumar (ETV Bharat)

MLA Dr Sanjay Kumar joining Congress :జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జగిత్యాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న స్థానిక ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డికి కనీసం సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేర్చుకోవటంపై ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

జీవన్‌ రెడ్డి మద్దతుదారులు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. జీవన్‌ రెడ్డిని కలిసి జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తున్నారు. అయితే జీవన్ ​రెడ్డితో కాంగ్రెస్ అధిష్ఠానం మాట్లాడుతున్నట్లు తెలిసింది. జీవన్‌ రెడ్డి మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకూ స్పందించలేదు.

ABOUT THE AUTHOR

...view details