Janmabhoomi Express Service Resumed : తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ను రైల్వే శాఖ మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది. విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనులు చేపట్టడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. నిడదవోలు- కడియం సెక్షన్లో ఆధునికీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ప్రయాణికులకు శుభవార్త - జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు పునరుద్ధరణ
Janmabhoomi Express (ETV Bharat)
Published : Jun 24, 2024, 7:51 PM IST
అయితే రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పునరుద్ధరించాలని విజ్ఞప్తులు రావడంతో తిరిగి విశాఖ- లింగంపల్లి ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ను ఈ నెల 25 నుంచి మామూలుగానే నడపాలని నిర్ణయించింది. జన్మభూమి ఎక్స్ప్రెస్తో పాటు విజయవాడ- కాకినాడ పోర్టు, చెంగల్పట్టు- కాకినాడ పోర్టు రైళ్లను కూడా పునరుద్ధరిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.