national

పెద్దపల్లి జిల్లాలో హైడ్రా ఎఫెక్ట్​ - అక్రమ నిర్మాణాలను కూల్చేసిన జిల్లా యంత్రాంగం

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 4:13 PM IST

Encroachments in Peddapalli
Hydra effect in Peddapalli (ETV Bharat)

Hydra effect in Peddapalli: హైడ్రా ఎఫెక్ట్ మొట్ట మొదటగా పెద్దపెల్లి జిల్లాను తాకింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల్లోనూ చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రకటన చేయడంతో స్పందించిన పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా చెరువులు ఆక్రమణలపై సర్వే నిర్వహించే రంగంలోకి దిగారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, సర్వే అధికారులు సిబ్బందితో కలిసి పెద్దపల్లి మండలం బొంపల్లి చెరువు వద్దకు వెళ్లి ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లను ఏర్పాటు చేసి ఆక్రమణలను తొలగించారు.

అనంతరం పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగంపల్లి చెరువు వద్దకు వెళ్లి చెరువు హద్దులో రియల్టర్లు ఏర్పాటు చేసిన గోడలను కూల్చివేశారు. చెరువు హద్దులను ఏర్పాటు చేసి ఆక్రమణదారులకు హెచ్చరికలు జారీ చేశారు. హైడ్రా తరహాలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా చెరువుల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details