national

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 5:15 PM IST

ETV Bharat / snippets

'హైదరాబాద్ అభివృద్ధిలో మెట్రో రైలు పాత్ర ఎంతో కీలకం - త్వరలోనే రెండో దశ పనులు'

hyd Metrorail MD NVS Reddy
Metrorail MD NVS Reddy on telangana Formation Day (ETV BHARAT)

Metrorail MD NVS Reddy on Formation Day : గడిచిన పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అనేక రంగాల్లో వేగంగా దూసుకెళ్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా రసూల్‌పురాలోని మెట్రో రైలు భవన్‌లో మెట్రో అధికారులు, సిబ్బందితో కలిసి ఎన్వీఎస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధిలో మెట్రో రైలు పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్న ఎన్వీఎస్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ అభివృద్ధి, మెట్రో రెండో దశ నిర్మాణం ఎజెండానే లక్ష్యంగా పని చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి పనులు మొదలుపెట్టనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details