ETV Bharat / snippets

నేడు హైదరాబాద్‌కు జేపీ నడ్డా - తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ నేతలతో చర్చ

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

BJP Chief JP Nadda Coming to Hyderabad
BJP Chief JP Nadda Coming to Hyderabad (ETV Bharat)

BJP Chief JP Nadda Coming to Hyderabad : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం 5:45 నుంచి 6:05 వరకు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

6:20 నుంచి 7:50 వరకు హరిత ప్లాజాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు. సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై ఆరా తీయనున్నారు. ఖైరతాబాద్‌లో సభ్యత్వ నమోదు క్యాంపెయిన్‌లో పలువురికి స్వయంగా సభ్యత్వాన్ని ఇవ్వనున్నట్లు పార్టీ నేతులు చెబుతున్నారు. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని 9:15కి ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.