national

ETV Bharat / snippets

పొన్నవోలుకు హైకోర్టులో షాక్ - భద్రత కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్ కొట్టివేత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2024, 9:31 PM IST

AP HC Dismisses Ponnavolu Petition
AP HC Dismisses Ponnavolu Petition (ETV Bharat)

AP HC Dismisses Ponnavolu Petition :మాజీ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని కోరుతూ పొన్నవోలు గతంలో ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఆయన తరఫు న్యాయవాది, ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారమే పొన్నవోలుకు భద్రత తొలగించారని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. సుధాకర్‌రెడ్డికి భద్రత కల్పించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. తాజాగా పొన్నవోలు పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details