national

By ETV Bharat Telangana Team

Published : 9 hours ago

ETV Bharat / snippets

రెయిన్ అలర్ట్ - ఉపరితల ఆవర్తనంతో రాగల రెండు రోజులు భారీ వర్షాలు

RAIN ALERT TO TELANGANA
Telangana Rain Updates (ETV Bharat)

Telangana Rain Updates :ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు మంగళవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలోనే రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

పశ్చిమ- మధ్య బంగాళాఖాతం వద్ద మరియు మయన్మార్ దక్షిణ తీరం దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న రెండు చక్రవాతపు ఆవర్తనాలు, ఇవాళ విలీనమయి మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంగా ఏర్పడుతోందని ఐఎండీ సంచాలకులు వివరించారు. ఇది సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటలలో పశ్చిమ- మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details