ETV Bharat / international

'యుద్ధ క్షేత్రంలో కాదు - ఉమ్మడి బలంలోనే విజయం' - మోదీ - PM Modi At United Nations - PM MODI AT UNITED NATIONS

PM Modi At United Nations : ప్రపంచ శాంతి, అభివృద్ధికిగాను అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన, ఐరాస జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్​ను ఉద్దేశించి మాట్లాడారు.

PM Modi
PM Modi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2024, 10:32 PM IST

Updated : Sep 24, 2024, 6:33 AM IST

PM Modi At United Nations : మానవాళి విజయం అనేది యుద్ధక్షేత్రాల్లో కాదు, ఉమ్మడి బలంలోనే దాగి ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం ఐరాసలో ఆయన ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. నమస్కార్‌ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రపంచంలో ఆరోవంతు జనాభా (140 కోట్ల మంది) భారతదేశ ప్రజల తరఫున తాను వాణి వినిపిస్తున్నానని చెప్పారు. ప్రపంచ భవితవ్యంపై అంతర్జాతీయ సమాజమంతా చర్చిస్తున్న తరుణంలో, మానవ కేంద్రంగా విధానాల రూపకల్పనకే అత్యంత ప్రాధాన్యం లభించాలని మోదీ అన్నారు. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రతలను చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. సుస్థిరాభివృద్ధి విజయవంతమవుతుందని ప్రపంచానికి చాటేలా భారత్‌లో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని చెప్పారు. ఈ అనుభవాన్ని యావత్‌ ప్రపంచంతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

సంస్థల సంస్కరణలతోనే అభివృద్ధి
ప్రపంచ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం గురించి ప్రధాని మోదీ మరోసారి ప్రస్తావించారు. శాంతి, అభివృద్ధిల సాధనకు ఇది అత్యావశ్యకమని చెప్పారు. ఒక సంస్థ ఔచిత్యాన్ని తేల్చడంలో సంస్కరణలు కీలకమని తెలిపారు. జీ-20కి భారత్‌ నేతృత్వం వహించినప్పుడు ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకపక్క ఉగ్రవాదం బెడద; మరోపక్క సైబర్, సముద్రయానం, అంతరిక్ష రంగాల్లో ఎదురవుతున్న సరికొత్త సవాళ్ల నుంచి ప్రపంచం బయటపడేలా తగిన స్థాయిలో ప్రయత్నాలు జరగాలని అన్నారు. ప్రపంచ ఆకాంక్షల్ని నెరవేర్చేలా ఈ ప్రయత్నాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. సాంకేతికతను వినియోగించడంలో ప్రపంచ స్థాయిలో సంతులన నియంత్రణ ఉండాలన్నారు. డిజిటల్‌ మౌలిక సదుపాయాలు ఒక అడ్డంకిగా కాకుండా, వారధిలా ఉండాలని చెప్పారు. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత' అనేదానికి భారతదేశం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆరోగ్యం, సౌర విద్యుత్తు విషయాల్లోనూ తమ దృక్పథం ఇదేనన్నారు. యావత్‌ మానవాళి హక్కుల పరిరక్షణకు, ప్రపంచ సుసంపన్నతకు మనసా, వాచా, కర్మణా పనిచేయడాన్ని భారత్‌ ఇకపైనా కొనసాగిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.

కఠిన నిర్ణయాలు అవసరం
ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రారంభోపన్యాసం చేస్తూ, 'పశ్చిమాసియా నుంచి ఉక్రెయిన్, సూడాన్‌ల వరకు పెచ్చుమీరుతున్న ఘర్షణలకు కనుచూపుమేరలో పరిష్కారం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం పట్టాలు తప్పుతున్న తరుణాన దానిని గాడిలో పెట్టడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. భౌగోళిక విభేదాలు, అణ్వస్త్రాలు, కొత్త ఆయుధాల అభివృద్ధి, యుద్ధాల ముప్పుతో ప్రపంచ భద్రత ప్రశార్థకంగా మారుతోందని గుటెరస్​ అన్నారు.

Last Updated : Sep 24, 2024, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.