ETV Bharat / snippets

జానీమాస్టర్​ కస్టడీ పిటిషన్​ - విచారణ మంగళవారానికి వాయిదా

author img

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

police Petition For Jani Master Custody
police Petition For Jani Master Custody (ETV Bharat)

police Petition For Jani Master Custody : అసిస్టెంట్​ కొరియోగ్రాఫర్​పై లైంగిక దాడి కేసులో అరెస్ట్​ అయిన జానీ మాస్టర్​ కస్టడీ పిటిషన్​పై విచారణ మంగళవారానికి వాయిదాపడింది. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు జానీ మాస్టర్​ను 5రోజుల కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోక్సో కేసు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై వాదనలను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా జానీ మాస్టర్ సైతం కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. కాగా బెయిల్ పిటిషన్​పై వాదనలను రంగారెడ్డి కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఈనెల 19న గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు 14రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.