Former MP Santhosh Kumar:స్వర్ణగిరి ఆలయంలో రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ఊరు ఊరుకో జమ్మి చెట్టు- గుడి గుడికో జమ్మి చెట్టు అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. వివిధ కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్టు దాని విశిష్టత రీత్యా ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరఫున ఊరు ఊరుకో జమ్మి చెట్టు- గుడి గుడికో జమ్మి చెట్టు నినాదాన్ని సంతోష్ కుమార్ తీసుకున్నారు. దసరా పండుగ నాడు ఈ కార్యక్రమం లాంఛనంగా జమ్మి మొక్కను నాటి ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కొత్త ప్రోగ్రాం- ఊరు ఊరుకో జమ్మి చెట్టు
JOGINAPALLI SANTHOSH RELEASED THE POSTER (ETV Bharat)
Published : Sep 27, 2024, 3:47 PM IST
దసరా, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరు ఊరుకో జమ్మిచెట్టు- గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమం మొదలవుతుందని భువనగరిలోని స్వర్ణగిరి ఆలయంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా సంతోష్‌కుమార్ ప్రకటించారు. ఇప్పటికే పది వేలకు పైగా జమ్మి మొక్కలను సిద్దం చేస్తున్నామని త్వరలోనే అన్ని గ్రామాలు, దేవాలయాలకు వీటిని పంపిణీ చేస్తామని చెప్పారు.