national

ETV Bharat / snippets

నకిలీ పత్రాలు పుట్టించి రూ.150 కోట్ల విలువైన ఇసుకను దోచుకున్నారు : కేటీఆర్​

KTR LATEST TWEET UPDATES
KTR on Sand Scam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 1:12 PM IST

KTR on Sand Scam :నకిలీ పత్రాలు, రసీదులు పుట్టించి ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి రూ.150 కోట్ల విలువైన ఇసుకను దోచుకున్న ఇంటిదొంగలపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గనుల శాఖలో అవినీతి ఘనులని ఎక్స్ వేదికగా ట్వీట్​ చేశారు. ఫేక్ డాక్యుమెంట్లు, రసీదులు పుట్టించి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి రూ.150 కోట్ల విలువ చేసే రూ.లక్షా 50 వేల టన్నుల ఇసుక దోచేశారని ఆరోపించారు.

హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్​ అవసరాల కోసమంటూ ఇంటి దొంగలు తప్పుడు కాగితాలు సృష్టించి ఇసుకను దారి మళ్లించారని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. సాక్షాత్తూ సీఎం రేవంత్ శాఖలోనే జరిగిన ఈ కుంభకోణం, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరగదని పేర్కొన్నారు. వెంటనే ఈ ఇసుక దొంగలెవరో దర్యాప్తు జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details